E-Paper
Advertisement

Trisha Krishnan: విజయ్ వార్తల మధ్య.‌. చీరలో కొత్త పెళ్లికూతురు లాగా మెరిసిన త్రిష..!

Trisha Krishnan: విజయ్ వార్తల మధ్య.‌. చీరలో కొత్త పెళ్లికూతురు లాగా మెరిసిన త్రిష..!
Advertisement

Trisha Krishnan: గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో త్రిష పేరు తెగ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ తో త్రిష ప్రేమలో ఉండడం వల్లే అతని భార్య ఆయనకు విరాకులు ఇచ్చింది అన్న వార్త తెగ వైరల్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోలు పంచుకున్నారు. ఈ ఫోటోల్లో త్రిషా సంప్రదాయ సారీ ధరించి కనిపించడంతో అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫోటోలో త్రిష ఏకంగా కొత్త పెళ్లికూతురు లాగా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఈ ఫోటోల్లో త్రిషా అందమైన పర్పుల్ రంగు పట్టు చీర ధరించారు. ఆ సారీలో గోల్డ్ జూలరి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో త్రిషా ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఆమె చీరకు సరిపోయేలా పొడవైన బంగారు హారం, గాజులు.. చెవి రింగులు ధరించారు. ఈ సంప్రదాయ అలంకరణతో ఆమె లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది.

Advertisement

త్రిషా ఈ ఫోటోలను షేర్ చేస్తూ చిన్న క్యాప్షన్ కూడా ఇచ్చారు. “Out and about” అని రాసి స్పార్కిల్
.. హార్ట్ ఎమోజీలను జోడించారు. ఈ పోస్ట్‌లో తన లుక్‌కు సహాయం చేసిన కొంతమంది ప్రొఫైల్ పేర్లను కూడా ఆమె పేర్కొన్నారు. వాటిలో పోతీస్ ఆఫీషియల్, జీఆర్టీ జ్యువెల్లర్స్, హర్షీన్ రవిచందర్, శక్తి త్రిపాఠి, యూఎస్‌పవర్3, మరియు రోహిణి హెయిర్ స్టైలిస్ట్ వంటి పేర్లు ఉన్నాయి.

Advertisement

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందించారు. చాలా మంది అభిమానులు త్రిషా సంప్రదాయ లుక్‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది “ఎప్పటికీ అందంగా కనిపించే హీరోయిన్” అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల త్రిషా పేరు తమిళ నటుడు.. రాజకీయ నాయకుడు విజయ్తో సంబంధించి వార్తల్లోకి వచ్చింది. చెన్నైలో జరిగిన ఒక పెళ్లి రిసెప్షన్‌లో విజయ్.. త్రిషా కలిసి రావడం
.. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ రూమర్లకు మరింత బలం చేకూర్చింది.

తర్వాత చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో త్రిషా కనిపించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోలో రిపోర్టర్లు విజయ్ గురించి ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించారు. అయితే త్రిషా ఆ ప్రశ్నలకు స్పందించకుండా నేరుగా ముందుకు వెళ్లిపోయారు.

ఇక విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు కూడా ఇటీవల చర్చకు వచ్చాయి. ఆయన భార్య సంగీతా సోర్నలింగం 2025 డిసెంబర్‌లో తమిళనాడు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ కేసు ఏప్రిల్‌లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

త్రిషా.. విజయ్ కలిసి గతంలో పలు హిట్ సినిమాల్లో నటించారు. వాటిలో ఘిల్లీ, తిరుపాచ్చి, ఆది, కురువి వంటి చిత్రాలు ప్రముఖంగా నిలిచాయి. దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత వారు మళ్లీ కలిసి లియో సినిమాలో కనిపించారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై ఇప్పటివరకు విజయ్ లేదా త్రిషా అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

ALSO READ: Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×