E-Paper
Advertisement

Weight Loss In Summer: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే వేసవి కాలం మీకు ఒక వరమే.. ఎందుకో తెలుసా?

Weight Loss In Summer: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే వేసవి కాలం మీకు ఒక వరమే.. ఎందుకో తెలుసా?
Advertisement

Weight Loss: చాలా మంది చలికాలంలో బద్ధకం వల్ల బరువు పెరుగుతుంటారు.కానీ వేసవి కాలం బరువు తగ్గడానికి ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎండల వల్ల ఆకలి తగ్గడం, నీటి వినియోగం పెరగడం, చెమట రూపంలో క్యాలరీలు ఖర్చు అవ్వడం వంటివి బరువు తగ్గడానికి దోహదపడతాయి. సరైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన వ్యాయామం తోడైతే..ఈ మూడు నెలల్లోనే ఆశించిన ఫలితాలను పొందవచ్చు. వేసవిలో బరువు తగ్గడం ఎందుకు సులభమో , ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో బరువు తగ్గడం ఎందుకు సులభం?
వేసవిలో మన జీవక్రియలు, ఆహారపు అలవాట్లలో కొన్ని సహజమైన మార్పులు వస్తాయి. అవేంటంటే..

Advertisement

1. ఆకలి తగ్గడం:
ఎండల వల్ల మన శరీరం తన ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో జీర్ణక్రియ కంటే శరీరాన్ని చల్లబరచడానికే ప్రాధాన్యత ఇస్తుంది. దీని వల్ల మనకు భారీ ఆహారం తినాలనిపించదు. జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ వైపు మనసు మళ్లదు. ఇది క్యాలరీల నియంత్రణకు దోహదపడుతుంది.

2. నీటి వినియోగం పెరగడం:
దాహం వల్ల మనం ఎక్కువ నీరు తాగుతాము. నీరు తాగడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీని వల్ల అనవసరమైన స్నాక్స్ తినడం తగ్గుతుంది. అలాగే, నీరు మెటబాలిజం రేటును పెంచి కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది.

Advertisement

3. తక్కువ క్యాలరీల పండ్లు:
వేసవిలో లభించే పుచ్చకాయ, కీరదోస, కర్బూజ వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు తక్కువ. వీటిని తినడం వల్ల శరీరానికి పోషకాలు అందడంతో పాటు బరువు పెరిగే అవకాశం ఉండదు.

త్వరగా బరువు తగ్గడానికి పాటించాల్సిన చిట్కాలు:
1. హైడ్రేటెడ్ గా ఉండండి:
బరువు తగ్గడానికి ప్రధాన సూత్రం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. భోజనానికి అరగంట ముందు గ్లాసు నీరు తాగడం వల్ల అతిగా తినకుండా ఉండవచ్చు. సాదా నీరు బోర్ కొడితే, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ తీసుకోవచ్చు.

2. ఆహారంలో మార్పులు:
లైట్ ఫుడ్: వేసవిలో మసాలాలు, నూనె పదార్థాలు తగ్గించి.. ఆవిరిపై ఉడికించిన ఆహారం, సలాడ్లు తీసుకోవాలి.

ప్రోటీన్: గుడ్లు, పప్పు ధాన్యాలు, సోయా వంటి ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల కండరాలు దృఢంగా ఉంటాయి. కొవ్వు కరుగుతుంది.

డిన్నర్: రాత్రిపూట చాలా తేలికపాటి ఆహారం (ఉదాహరణకు సూప్‌లు లేదా పండ్లు) తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది.

3. వ్యాయామ సమయం మార్చుకోండి:
మధ్యాహ్నం వేళ ఎండలో వ్యాయామం చేయడం ప్రమాదకరం. ఉదయం 6 నుంచి 7 గంటల లోపు లేదా సాయంత్రం 6 గంటల తర్వాత వాకింగ్, రన్నింగ్ లేదా సైక్లింగ్ చేయడం ఉత్తమం. ఈ సమయంలో చేసే వ్యాయామం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు సమర్థవంతంగా ఖర్చవుతాయి.

Also Read: డీహైడ్రేషన్ సమస్యా? ఇలా చేస్తే క్షణాల్లోనే ప్రాబ్లమ్ సాల్వ్

4. కూల్ డ్రింక్స్ కు దూరంగా..
బరువు తగ్గాలనుకునే వారు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్‌లకు దూరంగా ఉండాలి. వీటిలో ఉండే అధిక చక్కెర బరువును విపరీతంగా పెంచుతుంది. వీటికి బదులుగా ఇంట్లో తయారుచేసిన షుగర్ లేని జ్యూస్ లు తాగాలి.

5. తగినంత నిద్ర:
వేసవిలో పగటిపూట నిద్రపోవడం వల్ల బరువు పెరుగుతారని కొందరు భావిస్తారు. అయితే.. రాత్రిపూట కనీసం 7-8 గంటల గాఢ నిద్ర ఉండాలి. నిద్ర లేమి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఆకలి పెరుగుతుంది.

Related News

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

Big Stories

Advertisement
×