Trisha Rumors: తమిళనాడు ముఖ్యమంత్రి,కోలీవుడ్ దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారంటూ నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది.అయితే సాధారణంగా తనపై వచ్చే ఎలాంటి గాసిప్స్‌ను పెద్దగా పట్టించుకోని త్రిష, ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ గా, పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తన పెంపుడు కుక్క ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ బ్యూటీ, దానికి పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు ఇండస్ట్రీలో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
మూగజీవానికి మాత్రమే పర్మిషన్
తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి కేవలం ఈ మూగజీవానికి మాత్రమే పర్మిషన్ ఉందంటూ ఆమె రాసుకొచ్చారు. నేరుగా ఎవరి పేరు ఎత్తకపోయినా తనపై లేనిపోని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వారికే త్రిష ఈ రేంజ్‌లో చురకలు అంటించారంటూ ఫ్యాన్స్ ఈ పోస్ట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో మే నెల త్రిష జీవితంలో ఎంత ప్రత్యేకమైనదో చాటిచెప్పేలా ఆమె చేసిన మరో పోస్ట్ కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. మే నెల ప్రారంభంలోనే తనకు ఇష్టమైన నెల వచ్చేసిందంటూ పోస్ట్ పెట్టిన త్రిష, నెలాఖరులో మరికొన్ని క్రేజీ ఫొటోలను షేర్ చేశారు.
‘మ్యాజికల్ మే’
ఈ ఏడాది మే నెలను ఎప్పుడు తలచుకున్నా తన ముఖంలో తెలియని చిరునవ్వు వస్తుందంటూ ‘మ్యాజికల్ మే’ అని క్యాప్షన్ ఇచ్చారు. నిజానికి ఆమె అంతలా ఆనందపడడానికి కారణాలు కూడా గట్టిగానే ఉన్నాయి. మే 4వ తేదీన త్రిష పుట్టినరోజు కావడం ఒకెత్తయితే, సరిగ్గా అదే సమయంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమె అత్యంత ఆప్తమిత్రుడు విజయ్ నేతృత్వంలోని పార్టీ ఘనవిజయం సాధించి హిస్టరీ క్రియేట్ చేయడం మరో ఎత్తు.
ఏకంగా 348 కోట్లకు పైగా వసూళ్లు
విజయ్ రాజకీయాల్లో సెన్సేషన్ విక్టరీ కొట్టడంతో నమోదు చేయడంతో సోషల్ మీడియాలో విజయ్-త్రిష జోడీ పేరు మారుమోగిపోయింది.మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ త్రిషకు ఈ మే నెల ఎప్పటికీ గుర్తిండిపోయేలా చేసింది. ఆమె ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ ఏకంగా 348 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఒకే నెలలో ఒకవైపు బర్త్ డే,మరో వైపు విజయ్ పొలిటికల్ గా ,ఇంకో వైపు తన సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం వంటి వరుసగా హ్యాపీ మూమెంట్స్ త్రిషను ముంచెత్తాయి. అందుకే ఆమె ఈ నెలను మ్యాజికల్ మంత్ అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
మరో స్టార్ హీరో కూడా పొలిటికల్ ఎంట్రీకి సిద్దం
ఇదిలా ఉంటే, విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం పీఠాన్ని దక్కించుకున్న బాటలోనే కోలీవుడ్‌కు చెందిన మరో స్టార్ హీరో కూడా పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై సదరు హీరో తండ్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విజయ్ సాధించిన విజయం చూశాక మిగిలిన స్టార్స్ కూడా రాజకీయాల వైపు అడుగులు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి అటు విజయ్ రాజకీయ ప్రస్థానం, ఇటు త్రిష వరుస సక్సెస్‌లు, వారిద్దరి చుట్టూ తిరుగుతున్న రూమర్స్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఏది ఏమైనా రూమర్స్‌కు తనదైన శైలిలో చెక్ పెడుతూనే, తన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న త్రిష స్టైల్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
also read :నమ్మిన వాళ్లే నట్టేట ముంచారు.. బాలీవుడ్ బ్యూటీ ఫ్యామిలీలో రూ.25 లక్షల భారీ చోరీ..