E-Paper
Advertisement

Bhagyashri Borse : కాంత సినిమా చూసాక నన్ను సావిత్రి గారితో పోల్చారు, భాగ్యశ్రీ పై ట్రోలింగ్ స్టార్ట్

Bhagyashri Borse : కాంత సినిమా చూసాక నన్ను సావిత్రి గారితో పోల్చారు, భాగ్యశ్రీ పై ట్రోలింగ్ స్టార్ట్
Advertisement

Bhagyashri Borse : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించాలి అంటే కేవలం అందం మాత్రం ఉంటే సరిపోదు. టాలెంట్ అలానే మంచి కథలను ఎంచుకునే జడ్జిమెంట్ కూడా ఉంటేనే కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ.

ఆ సినిమా విడుదలవడానికి అంటే ముందు ఆ మ్యూజిక్ బాగా హిట్ అయింది. ఆ మ్యూజిక్ విన్న తర్వాత చాలామంది సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మారు. అలానే హరీష్ శంకర్ ,రవితేజ కాంబినేషన్ కాబట్టి అంచనాలు కూడా అదే స్థాయిలో ఉండేవి. కానీ సినిమా వర్కౌట్ కాలేదు. అయితే భాగ్యశ్రీ కి మాత్రం మంచి పేరు వచ్చింది. వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి.

సావిత్రి తో పోల్చారు 

Advertisement

ప్రస్తుతం భాగ్యశ్రీ బిజీగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి రానా నిర్మించిన కాంత సినిమా కొద్దిరోజుల క్రితమే బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఈ సినిమా డిజాస్టర్ టాక్ మూట కట్టుకుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ కూడా నటించారు. దుల్కర్ సల్మాన్ పాత్రకు ఈ సినిమాలో మంచి పేరు వచ్చింది.

ఈ సినిమా చూసిన తర్వాత కొంతమంది జర్నలిస్టులు నన్ను కలిసి మీ పర్ఫామెన్స్ ఈ సినిమాలో మహానటి సావిత్రి గారిని గుర్తు చేసింది అని చెప్పారట. ఇలా చెప్పడం అనేది సహజంగానే జరుగుతుంది. కానీ మనం ఏ స్థాయిలో పర్ఫామెన్స్ చేశాము అనే క్లారిటీ మనం కూడా ఉంటుంది.

Advertisement

భాగ్యశ్రీ పర్ఫామెన్స్ ను తప్పు పట్టలేము. కానీ మహానటి సావిత్రి గారి పర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేష్ మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు భాగ్యశ్రీ ఈ మాట అనడంతో భాగ్యశ్రీ పైన కూడా టోలింగ్ మొదలు అయింది.

ఆంధ్ర కింగ్ తాలూకా సక్సెస్ 

మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సినిమాలో భాగ్యశ్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాతో తెలుగులో మొదటి సక్సెస్ అందుకుంటుంది అని అందరూ నమ్ముతున్నారు.

హీరో రామ్ కూడా మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత బ్యూటీ తో మంచి పర్ఫార్మర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు అని మాట్లాడారు. ఇక సినిమా రిలీజ్ తర్వాత పర్ఫామెన్స్ అరేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది.

Also Read: Anaganaga Oka Raju : సంక్రాంతి రేస్ నుంచి రాజుగారు అవుట్, కొత్త రిలీజ్ డేట్ ఇదే

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×