E-Paper
Advertisement

MSVPG Movie: చిరంజీవి మూవీపై రామ్ చరణ్, ఉపాసన రివ్యూ!

MSVPG Movie: చిరంజీవి మూవీపై రామ్ చరణ్, ఉపాసన రివ్యూ!
Advertisement

MSVPG Movie:వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయం అందుకున్న చిరంజీవి(Chiranjeevi ) ఆ తర్వాత నటించిన చిత్రం భోళాశంకర్. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. పైగా ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా మహానటి కీర్తి సురేష్ నటించినా.. ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత చిరంజీవి ప్రకటించిన చిత్రం విశ్వంభరా. ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా.. విఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడింది .ఈ ఏడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయబోతున్నారు.అయితే మధ్యలో అనిల్ రావిపూడి తో మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో సంక్రాంతి పండుగకి వచ్చారు చిరంజీవి. అందులో భాగంగానే జనవరి 12న ఈ సినిమా విడుదలయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

ఇకపోతే పలువురు సెలబ్రిటీలు కూడా చిరంజీవి సినిమా చూసి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులోని ఏఎంబి సినిమాస్ lo మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన భార్య ఉపాసన(Upasana)తో కలిసి సినిమా వీక్షించారు. అనంతరం తమ రివ్యూ పంచుకుంటూ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు. మా తండ్రికి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ అనిల్ రావిపూడి ని రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని , మెగా అభిమానులకు ఇది అసలైన సంక్రాంతి పండుగ లాంటిదని రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. మొత్తానికి అయితే తన తండ్రి సినిమా పై ఇటు రాంచరణ్ అటు ఉపాసన ప్రశంసలు కురిపించారు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా విశేషాలు.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాల్లో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. కేథరిన్ థ్రేసా మరో కీలక పాత్ర పోషించారు. విక్టరీ వెంకటేష్ తన అద్భుతమైన నటనతో అభిమానుల హృదయాలను దోచుకున్నారు. అసలైన సంక్రాంతి పండుగను తీసుకొచ్చారని చిరంజీవి – వెంకటేష్ కాంబోపై ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరించారు. అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

also read:MSVPG Movie: చిరంజీవి కంటే తల్లి వయసే చిన్నదే.. ఏంటి అనిల్ గారు చూసుకోలేదా?

రామ్ చరణ్ సినిమాలు..

Advertisement

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్.. త్వరలోనే షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. పైగా ఈ చిత్రాన్ని రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27వ తేదీన థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×