E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ వస్తోంది.. నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ వస్తోంది.. నిడివి ఎంతో తెలుసా?
Advertisement

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులు, సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. కారణం, ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) కాంబోలో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకం ఉండటమే. ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోన్న ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్ల జోరు పెంచారు. రీసెంట్‌గా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్‌ని వదిలి, ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చిన మేకర్స్.. ఇప్పుడో పవర్ ఫుల్ గ్లింప్స్‌ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ, అంతే పవర్ ఉన్న పోస్టర్‌ను వదిలారు.

Also Read- Son Of Movie Review: సాయి సింహాద్రి ‘కొడుకు’ పాత్రను జస్టిఫై చేశాడా?.. ‘సన్ ఆఫ్’ ఫుల్ రివ్యూ ఎలా ఉందంటే?

పోస్టర్‌తో ఫిదా..

Advertisement

ముందుగా ఈ పోస్టర్‌ను గమనిస్తే.. ఈ సినిమాపై ఉన్న అంచనాలను తాజాగా వదిలిన పోస్టర్ మరో స్థాయికి తీసుకెళ్లిందంటే నమ్మాలి. ‘అన్నవరం’ సినిమాలో ‘నీ వల్లే నీవల్లే’ అనే పాటలో, అలాగే ‘బద్రి’ సినిమాలో ‘హే చికితా’ పాటలో పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఉన్నారో.. ఈ పోస్టర్‌లో కూడా అలాగే కనిపించి మెస్మరైజ్ చేస్తున్నారు. ఇందులో హ్యాట్ ధరించి స్టైలిష్‌గా ఉన్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పోస్టర్ విడుదలైన కాసేపటికే ట్రెండ్ బద్దలైందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అభిమానులు, సినీ ప్రియులు పవన్ కళ్యాణ్ లుక్‌కి ఫిదా అవుతున్నారు. ఈ భారీ స్పందన మరోసారి ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌ ఏంటనేది తెలియజేస్తోంది. ఇక గ్లింప్స్ విషయానికి వస్తే.. పాటలు, పోస్టర్లతో హైప్ పెంచుతూ వచ్చిన మేకర్స్.. ఇప్పుడో పవర్ ప్యాక్డ్ గ్లింప్స్‌ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

Also Read- Deepika Padukone: స్పిరిట్, కల్కి 2 తర్వాత మరో భారీ ఛాన్స్ మిస్ చేసుకున దీపికా పదుకొణె..!

గ్లింప్స్ నిడివి ఎంతంటే?

Advertisement

అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచేలా.. త్వరలోనే చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ 40 సెకన్ల నిడివితో ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కూడా ఉంటాయని వెల్లడించారు. ఈ ప్రత్యేక గ్లింప్స్‌తో చిత్రంలోని స్థాయి, తీవ్రత, మాస్ ఎలిమెంట్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారట. ఈ గ్లింప్స్‌ అభిమానులకు అసలు సిసలైన మాస్ విందుని అందించనుందని టీమ్ చెబుతోంది. గతంలో ‘గబ్బర్ సింగ్’తో సంచలనాలు సృష్టించిన బ్లాక్‌బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో చూపించబోతున్నారు. అన్ని అంశాల మేళవింపుతో సంపూర్ణ వినోదభరిత చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.

Also Read- Vishnu Vinyasam Review: విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. ప్రేక్షకులకి ఆయాసం

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×