E-Paper
Advertisement

Truck vs Scorpio Collision: మృత్యువులా దూసుకొచ్చిన లారీ.. స్కార్పియో నుజ్జునుజ్జు.. నలుగురు మృతి!

Truck vs Scorpio Collision: మృత్యువులా దూసుకొచ్చిన లారీ.. స్కార్పియో నుజ్జునుజ్జు.. నలుగురు మృతి!
Advertisement

Truck vs Scorpio Collision: ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక లారీ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను దాటుకుంటూ అవతలి వైపు ఉన్న రోడ్డుపైకి దూసుకువచ్చింది. అదే సమయంలో  వేగంగా వెళ్తున్న ఒక స్కార్పియో కారును ఈ లారీ నేరుగా ఢీకొట్టింది.  లారీ కింద పడి స్కార్పియో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా, ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హైవే పక్కన నిబంధనలకు విరుద్ధంగా లారీలను పార్కింగ్ చేయడమే ఈ ప్రాణ నష్టానికి ప్రధాన కారణమని వారు విమర్శిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు.. వీడియో ఆధారాల ప్రకారం.. రోడ్డుపై ఆగి ఉన్న లారీలను గమనించిన ఒక లారీ డ్రైవర్ వాటిని తప్పించే క్రమంలో ఒక్కసారిగా స్టీరింగ్‌ను కుడివైపు తిప్పాడు. దీనివల్ల ఆ లారీ వెనుకనే వేగంగా వస్తున్న మరో లారీ డ్రైవర్ అప్రమత్తం కాలేకపోయాడు. వెనుక ఉన్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఎక్కి అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న స్కార్పియోను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే కారు పూర్తిగా నలిగిపోవడంతో ఎవరినీ కాపాడలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Read Also: Gas cylinder blast: నిజామాబాద్ జిల్లాలో పేలిన సిలిండర్.. కాలి బూడిదైన ఇల్లు.. స్పాట్‌‌లో

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×