E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: పవన్ సినిమాలో పార్దిబన్..ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!

Ustaad Bhagat Singh: పవన్ సినిమాలో పార్దిబన్..ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!
Advertisement

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). ఈ సినిమా అనుకున్న సమయానికంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల కాబోతోంది అంటూ అభిమానులు భావించారు కానీ మార్చిలో విడుదల కావాల్సిన పెద్ది, ది ప్యారడైజ్ సినిమాలు విడుదల నుంచి తప్పుకోవడంతో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం సినిమా పనులను పూర్తి చేస్తున్నారు ఇప్పటికే డబ్బింగ్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

నల్ల నాగప్ప పార్దిబన్?

ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ లభించింది. అతి త్వరలోనే సెకండ్ సింగిల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి మరొక కీలక అప్డేట్ తెలియజేశారు ఈ సినిమాలో నటుడు పార్దిబన్ (Parthiban)కూడా నటించబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం తెలియచేశారు. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తూ ఈ సినిమాలో ఈయన నల్ల నాగప్ప(nalla nagappa) అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలియజేశారు.

రాజకీయ నాయకుడిగా పార్దిబన్?

Advertisement

ఇక ఈయనకు సంబంధించిన పోస్టర్ చూస్తుంటే ఈయన ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ సినిమాలో పార్దిబన్ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే హీరోయిన్లుగా శ్రీలీల (Sreeleela)కనిపించగా మరొక హీరోయిన్ రాశి కన్నా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

Advertisement

ఇదివరకు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తిరిగి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడ మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓజి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

Also Read: Samyuktha Menon: సంయుక్త చేతి పై ఈ గుర్తు చూసారా? వింత గుర్తుకు అర్థం ఏంటబ్బా!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×