E-Paper
Advertisement

Marriage Offer: అక్కడ పెళ్లి చేసుకుంటే రూ. 30 లక్షలు ఇస్తారట.. ఈ ఆఫర్ భలే బాగుంది బ్రో!

Marriage Offer: అక్కడ పెళ్లి చేసుకుంటే రూ. 30 లక్షలు ఇస్తారట.. ఈ ఆఫర్ భలే బాగుంది బ్రో!
Advertisement

ప్రభుత్వాలు ప్రజల చదువుల కోసం, ఆరోగ్యం కోసం పథకాలు ప్రవేశ పెట్టడం చూస్తుంటాం. కొన్ని ప్రభుత్వాలు పెళ్లి కోసం కూడా సాయం చేస్తుంటాయి.  తెలంగాణ ప్రభుత్వం కూడా కల్యాణ లక్ష్మీ పథకం కింది రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందించడం కూడా చూశాం. అయితే, ఇటలీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. కానీ, మనలా రూ.1 లక్ష కాకుండా ఏకంగా రూ. 30 లక్షలు అందిస్తుంది. పెళ్లి చేసుకుంటే అంత డబ్బు ఇవ్వడం ఏంటని ఆశ్చర్యం కలుగుతుందా? ఇంతకీ ఆ ప్రభుత్వం ఈ ఆపర్ ఎందుకు ఇస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ప్రభుత్వం ఎందుకు ఈసాయం చేస్తుంది?

ఇటలీ ప్రభుత్వం తీసుకున్న ఈ మనీ ఆఫర్.. నేరుగా పెళ్లి చేసుకోవడానికి కాదు. పెళ్లి అనంతరం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థికసాయం అందిస్తోంది. ముఖ్యంగా దక్షిణ ఇటలీలోని కాలాబ్రియా ప్రాంతంలో చిన్న గ్రామాలకు వెళ్లి వ్యాపారం ప్రారంభించే కొత్త జంటలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గుదలను నిరోధించడం, గ్రామాల్లో జనాభాను పెంచడమే లక్ష్యంగా ‘యాక్టివ్ రెసిడెన్సీ ఇన్ కమ్’ కార్యక్రమం ద్వారా ఈ ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నది.

కాలాబ్రియా ప్రాంతంలోనే ఎందుకు?   

Advertisement

నిజానికి కాలాబ్రియా పరిసర పట్టణాల్లో 5,000 కంటే తక్కువ మంది నివసిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని గ్రామాల్లో ఉన్న సంఖ్యతో పోల్చితే ఇది చాలా తక్కువ జనాభా. ఆయా గ్రామాలు, పట్టణాల నుంచి యువకులు పెద్ద నగరాలకు, విదేశాలకు వెళ్లడం వలన చాలా గ్రామాల్లో జనాభా అంతరించేపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు లేక వెలవెలబోతున్న గ్రామాల్లో మళ్లీ జనాల కళకళ కోసం ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకుని, గ్రామాల్లో పూర్తి సమయం నివసించడంతో పాటు వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ డబ్బులు అందిస్తోంది. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతంలో యువతను ఆకర్షించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అదే సమయంలో హై స్పీడ్ ఇంటర్నెట్ లాంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది.

ఆర్థిక ప్రోత్సాహకం పొందేందుకు ఉండాల్సిన అర్హతలు

ఈ ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కొన్ని షరతులను పెట్టింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు 40 ఏళ్ల లోపు ఉండాలి. ఒకవేళ మీరు గ్రామాల్లో వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే, అందుకు సంబంధించిన అనుభవాన్ని కలిగి ఉండాలి. దరఖాస్తు ఆమోదించబడిన 90 రోజులలోపు ఎంచుకున్న గ్రామానికి మారడానికి సిద్ధంగా ఉండాలి. ఈ పథకం కింద లద్ది పొందేవాళ్లు ఎంపిక చేసుకున్న గ్రామంలోనే పూర్తిగా నివాసం ఉండాలి. అటు ఈ డబ్బు అంతా ఒకేసారి కాకుండా 2 నుంచి 3 సంవత్సరాల లోపు నెలవారీ ఆదాయంగా అందిస్తుంది.

ఏ గ్రామాల్లో ఈ పథకం అమలు అవుతుందంటే?

Advertisement

ఈ పథకం కాలాబ్రియా పరిధిలోని సివిటా, సామో, మరియు ప్రీకాకోర్, ఐయేటా, బోవా, కాకురి, అల్బిడోనా, శాంటా సెవెరినా, శాన్ డోనాటో డి నినియా లాంటి గ్రామాల్లో నివాసం ఉండేవారికి ఎక్కువగా అందిస్తున్నారు. కాలాబ్రియా లోకల్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో దక్షిణాన చిన్న, తీరప్రాంత, పర్వత గ్రామాల జనాభాను పెంచడానికి బాగా ఉపయోగపడుతోంది.

Read Also: పెళ్లి కోసం 97 ఏళ్ల వృద్ధుడి పోరాటం.. కొడుకుపై గెలిచి.. ప్రేయసిని దక్కించుకొని..!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×