E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: ఉస్తాద్ హైలెట్స్.. వీటి కోసమైనా సినిమా చూడాల్సిందే!

Ustaad Bhagat Singh: ఉస్తాద్ హైలెట్స్.. వీటి కోసమైనా సినిమా చూడాల్సిందే!
Advertisement

Ustaad Bhagat Singh:ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరొకసారి నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇదివరకే వీరి కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు శ్రీలీల, రాశిఖన్నా వంటి యంగ్ హీరోయిన్స్ ఈ సినిమాలో భాగమవ్వడం మరో విశేషం. ఇకపోతే ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కం నటుడు ఆర్. పార్థిబన్ ఈ సినిమా ద్వారా విలన్ గా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధం అయిపోయారు.

ధురంధర్ 2: ది రివేంజ్ పోటీగా..

ఇదిలా ఉండగా ఈ సినిమాకి పోటీగా ధురంధర్ 2: ది రివేంజ్ సినిమా డబ్బింగ్ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. పైగా ఉస్తాద్ కంటే కూడా ఈ సినిమాకే టికెట్స్ భారీగా అమ్ముడుపోతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఉస్తాద్ మూవీ అందుకే చూడాలి.. వాటిలో హైలెట్స్ ఇవే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హైలెట్స్ ఇవే..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో మొత్తం నాలుగు భారీ ఫైట్లు ఉండబోతున్నాయట. ఫస్ట్ హాఫ్ లో రెండు ఫైట్స్ , సెకండ్ హాఫ్ లో రెండు ఫైట్స్ ఉంటాయని, ఇవి థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్ తో కూడిన ఇంట్రడక్షన్ సీను సినిమాకే హైలెట్ అని సమాచారం.. పవన్ కెరియర్ లోనే ఎవర్గ్రీన్ హిట్ ‘తొలిప్రేమ’ సినిమాలోని “మనసై” పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ పాట థియేటర్లలో రీ సౌండ్ వచ్చేలా ఉంటుందని, ఇంటర్వెల్ ఫైట్ సినిమా సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచుతుందని. ఈ సినిమా ఎమోషనల్, గా పవర్ ఫుల్ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

ALSO READ:R.Parthiban: మళ్లీ వివాదంలో ఆర్.పార్థిబన్.. క్షమాపణలు కూడా చెబుతూ!

చైల్డ్ సెంటిమెంట్ కూడా..

Advertisement

పైగా ఈ సినిమా మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుందని అలాగే సెకండ్ హాఫ్ లో చైల్డ్ సెంటిమెంట్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణం పోస్తుందని కూడా సమాచారం. ముఖ్యంగా ఇలాంటి అంశాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. దేఖ్ లేంగే సాలా సాంగులో పవన్ స్టెప్పులు థియేటర్లను హోరెత్తించడం ఖాయం అని కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఈ సినిమా ఉందని ఇండస్ట్రీ ఇన్సైడ్ వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ సినిమా టాక్ బయటకు వస్తే తప్ప ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పలేం.. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య అటు ధురందర్ 2 సినిమాకి పోటీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×