E-Paper
Advertisement

Varanasi Title: వారణాసి టైటిల్ వివాదానికి తెర పడినట్లే..తెలుగులో చిన్న మార్పు?

Varanasi Title: వారణాసి టైటిల్ వివాదానికి తెర పడినట్లే..తెలుగులో చిన్న మార్పు?
Advertisement

Varanasi Title: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాకు వారణాసి అనే టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్లోబ్ ట్రాటర్ అంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా టైటిల్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా టైటిల్ ప్రకటించిన నేపథ్యంలో రాజమౌళి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇదివరకు వారణాసి అనే టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అయినప్పటికీ రాజమౌళి తన సినిమాకు కూడా వారణాసి అని పేరు పెట్టడంతో వివాదం చెలరేగింది. ఈ విషయంపై రాజమౌళి పట్ల కేసులు కూడా నమోదు అయ్యాయి.

రాజమౌళి పై ఫిర్యాదులు..

రామభక్త హనుమ నిర్మాణ సంస్థ వారణాసి అనే టైటిల్ రిజిస్టర్ చేయించుకొని ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇలా వేరే నిర్మాణ సంస్థ సినిమా పోస్టర్ విడుదల చేసిన అనంతరం రాజమౌళి కూడా తన సినిమాకు వారణాసి అంటూ టైటిల్ ప్రకటించడంతో రామభక్త హనుమ నిర్మాతలు రాజమౌళి పై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ఇలా ఈ టైటిల్ వివాదం ఇన్ని రోజులు పాటు కొనసాగుతూ వచ్చింది. చివరికి ఈ టైటిల్ వివాదానికి తెరపడినట్లేనని ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని తెలుస్తోంది.

రాజమౌళి వారణాసి..

Advertisement

రాజమౌళి వారణాసి సినిమా తెలుగు వర్షన్ లో వారణాసి అని మాత్రమే కాకుండా రాజమౌళి వారణాసి(Rajamouli Varanasi) అని టైటిల్ ఉండబోతుందని మిగిలిన భాషలలో వారణాసిగానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇదివరకే వారణాసి టైటిల్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో రాజమౌళి కూడా ఈ సినిమా టైటిల్ ను ఇంగ్లీషులో మాత్రమే విడుదల చేశారేతప్ప తెలుగులో ఎక్కడ విడుదల చేయలేదు. ఇకపై తెలుగులో ఈ సినిమా రాజమౌళి వారణాసిగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ విధంగా సినిమా టైటిల్ వివాదం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది అయితే ఈ వివాదానికి ఇంతటితో పులిస్టాప్ పడినట్లేనని చెప్పాలి.

వారణాసిలో మహేష్ మేనల్లుడు..

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే చిన్నప్పటి మహేష్ బాబు పాత్రకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో తన మేనల్లుడు దర్శన్ నటించబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి అయితే ఇప్పటివరకు ఈ విషయంపై చిత్ర బృందం మాత్రం ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు. ఇక ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కుంభ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా కనిపించబోతున్న నేపథ్యంలో హనుమంతుడి పాత్ర కోసం మాధవన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

Also Read: Siva Jyothi: తిరుమల వివాదం మరో పోస్ట్ వేసిన శివజ్యోతి…నేనేంటో స్వామికే తెలుసంటూ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×