E-Paper
Advertisement

Kurnool Politics: కర్నూల్‌లో కుర్చీ కోసం సై అంటే సై అంటున్న.. అఖిలప్రియా Vs ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డి

Kurnool Politics: కర్నూల్‌లో కుర్చీ కోసం సై అంటే సై అంటున్న.. అఖిలప్రియా Vs ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డి
Advertisement

Kurnool Politics: భూమా వర్సెస్ ఎస్వీ జగన్.. ఇప్పుడు కర్నూలు పాలిటిక్స్‌లో ఇదే హాట్‌ టాపిక్. ఓ పదవి కోసం ఒకే కుటుంబానికి చెందిన వీరంతా ఇప్పుడు తన్నుకునే పరిస్థితి నెలకొంది. కుర్చీ కోసం మాటలతో మంటలు పుట్టిస్తున్నారు.. సవాళ్ల వర్షం కురిపిస్తున్నారు. సై అంటే అంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇంతకీ వీరి ఫైట్‌ దేని కోసం? ఈ పంచాయితీకి ఎండ్ కార్డ్‌ ఎప్పుడు పడనుంది?

సవాళ్ల వర్షం కురిపిస్తూ హాట్ పెంచుతున్న నేతలు
కర్నూలు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ భూమా అఖిలప్రియా వర్సెస్‌ ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇరువురు సవాళ్ల వర్షం కురిపించుకుంటూ హీట్‌ను పెంచుతున్నారు. కోట్ల రూపాయలు ఎగవేశారంటూ ఎస్వీ జగన్‌ ఆరోపిస్తుండగా.. అవినీతి ఎక్కడ చేశామో చూపించాలంటూ భూమా కుటుంబం ప్రతి సవాల్‌ విసురుతోంది.

Advertisement

ఎస్వీ జగన్ 35 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులు
విజయ డెయిరీకి సంబంధించిన నంద్యాల పాల సొసైటీ ఎన్నికలు ఇప్పుడు ఉద్రిక్తంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎస్వీ జగన్ 35 ఎకరాలు కబ్జా చేశారని మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేసినట్లుగా ఆళ్లగడ్డ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ సర్క్యూలేట్ కావడంతో ఈ వివాదం కాస్త ముదిరింది.

శిలాఫలకం తొలగించి మురికి కాలువలో పడేశారనే ఆరోపణలు
నిజానికి మాజీమంత్రి భూమా అఖిలప్రియ అకస్మాత్తుగా పాల కేంద్రానికి వెళ్లినప్పుడు.. ఎన్టీ రామారావు శిలాఫలకం తొలగించి మురికి కాలువలో పడేశారని ఆరోపించారు అఖిలప్రియ. ఆ సమయంలో ఈ అంశంపై చాలా ఘాటుగా స్పందించారు ఆమె. అంతేకాదు కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ ఫోటోలు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే శిలాఫలకం శిథిలావస్థలో చేరడంతో తీసి పక్కకు పెట్టామని దాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని అఖిలప్రియ రచ్చ చేస్తుందని ఎస్వీ జగన్ చెప్పుకొచ్చారు.

Advertisement

ఎస్వీ జగన్ కూర్చిలోనే కూర్చొన్న భూమా అఖిలప్రియ
నిజానికి భుమా అఖిలప్రియ డెయిరీ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో అక్కడ తన మామ ఎస్వి జగన్మోహన్ రెడ్డి లేకపోవడంతో ఆమె ఆయన కూర్చిలోనే కూర్చున్నారు. అక్కడి నుంచే ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ అంశంపై కూడా ఎస్వీ జగన్ అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. తన కళ్ల ముందు పెరిగిన చిన్నపిల్ల ఇలా ప్రవర్తించడం ఏంటంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎస్వీ జగన్. అంతేకాదు తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి చైర్మన్ పదవిని కట్టపెట్టడమే అఖిలప్రియ లక్ష్యమంటున్నారు ఆయన.

గతంలోవారు ఏర్పాటు చేసిన జగత్ డెయిరీ ద్వారా విజయ డెయిరీకి చాల నష్టం జరిగిందంటున్నా ఎస్వీ జగన్. ఏదేమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి సమస్యలు తప్పడం లేదు. ఓవైపు తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం శత ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా పరిస్థితులు ఉండేవనే టాక్ ఉంది. కానీ ఇప్పుడా పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.

నిజానికి ఇప్పటికే డెయిరీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అయితే చాలా వరకు ఈ ఎన్నికలను భూమా వర్గం అడ్డుకుంటుంది అనేది ఎస్వీ జగన్ వర్గం చేస్తున్న ఆరోపణ. డిఫాల్టర్ అయిన భూమా విఖ్యాత్ రెడ్డి ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా అర్హత లేదనేది ఆయన వాదన. చైర్మన్ పదవి కోసం భూమా అనుచరులు భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికలను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికలను అడ్డుకుంటున్నారని పోలీసులకు తెలియజేసిన పోలీసులు కూడా తమకు సెక్యూరిటీ ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. అయితే జగన్‌మోహన్ రెడ్డి కొందరు టీడీపీ మంత్రులను కలిసి తననే చైర్మన్‌గా కొనసాగించాలని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ తనను పదవి నుంచి తొలగిస్తే న్యాయపోరాటం చేస్తానని కూడా గతంలో చెప్పుకొచ్చారు ఆయన. అయితే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తన తమ్ముడిని చైర్మన్‌ చేయాలనే ఆలోచనలో భూమా అఖిలప్రియ ఉన్నట్టు కనిపిస్తోంది. దీని కోసం ఇప్పటికే పార్టీ అధిష్టానంతో సంప్రదిస్తున్నట్టు సమాచారం.

గతంలో భూమా ఫ్యామిలీకి ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలలో కొంత బలమైన క్యాడర్ ఉండేది. అలాంటి క్యాడర్ ఇప్పుడు కాస్త చేజారింది. దీంతో నంద్యాలలో తమ క్యాడర్‌ను కాపాడుకోవడం కోసం ఈ పదవిని దక్కించుకోవడం అవసరం అనే ఆలోచనలో భూమా కుటుంబం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే భూమా కుటుంబం 2015లో జగత్‌ డెయిరీని ప్రారంభించి.. సరిగా నడపలేక కరోనా సమయంలో మూసివేసిందనే చర్చ ఉంది. ఇది మళ్లీ ఇప్పటి వరకు తిరిగి ప్రారంభం కాలేదు. ఇప్పుడు విజయ డెయిరీ చైర్మన్‌గా అవకాశం దక్కించుకొని.. తమ సొంత డెయిరీని తిరిగి ప్రారంభిస్తారనే ఆరోపణలు కూడా జోరుగానే వినిపిస్తున్నాయి.

Also Read: 2047కు 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన, కానీ.. ఆ విషయంలో వెనుకబడ్డాం: భట్టి విక్రమార్క

ఏదేమైనా డెయిరీ చైర్మన్ అంశం.. ఇప్పుడు కర్నూలు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా అయితే మారింది. అంతేకాదు శిలాఫలకంతో మొదలైన ఈ వివాదం.. ఎప్పటికి ఎండ్‌ కార్డ్‌ పడుతుందో చూడాలి. ప్రస్తుతానికి గ్రామీణ, మండల స్థాయిలో జరిగే ఎన్నికలు ప్రతి చోటా వివాదస్పదంగా మారుతున్నాయి. మరి ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Story By Vamshi Krishna, Bigtv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×