E-Paper
Advertisement

Tollywood: సైకిల్ రైడ్ చేస్తున్న ఈ క్యూట్ కిడ్స్ ఎవరో గుర్తుపట్టారా?

Tollywood: సైకిల్ రైడ్ చేస్తున్న ఈ క్యూట్ కిడ్స్ ఎవరో గుర్తుపట్టారా?
Advertisement

Tollywood:సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ఇట్టే వైరల్ అవుతోంది. దీనికి తోడు సెలబ్రిటీలు కూడా అభిమానులకు చేరువవ్వడానికి నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను.. బాల్యానికి చెందిన స్మృతులను అభిమానులతో పంచుకుంటూ సంతోషపడుతున్నారు. ఈ క్రమంలోనే తమ చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ మరో ఇద్దరూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

పైన ఫోటోలో కనిపిస్తున్న కిడ్స్ ఎవరో గుర్తుపట్టారా?

ఈ క్రమంలోనే పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ కిడ్స్ ఎవరో ఇప్పటికే మీరు గుర్తుపట్టారా? సైకిల్ రైడ్ చేస్తున్న ఈ క్యూట్ కిడ్స్ సెలబ్రిటీ కిడ్స్ కావడం గమనార్హం. పైగా ఇండస్ట్రీలో పేరు మోసిన కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అన్నాచెల్లెళ్లు కావడం విశేషం. ఇక వారెవరో గుర్తుపట్టారా? వారేనండి.. మెగా కుటుంబం నుండి వచ్చిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్(Varun tej), కూతురు నిహారిక కొణిదెల (Niharika Konidela). ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో నిహారిక తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన అన్నయ్యతో గడిపిన చిన్ననాటి క్షణాలను అభిమానులతో పంచుకుంది.

ఆకట్టుకుంటున్న సెలబ్రిటీ కిడ్స్..

Advertisement

తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. నిహారిక తన అన్నయ్య సైకిల్ రైడ్ చేస్తుండగా వెనుకల కూర్చున్న ఫోటోని పంచుకుంది. అంతేకాదు తన అన్నయ్య తనను ఒడిలో కూర్చోబెట్టుకున్న ఫోటోని కూడా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదండోయ్ తన అన్నయ్య కొడుకు వాయువ్ తేజ్ ను తన హృదయానికి హత్తుకొని ప్రేమగా లాలిస్తున్న ఫోటోని కూడా పంచుకుంది. మొత్తానికి అయితే నిహారిక షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాయి.

సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్..

వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. 2024లో మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీనికంటే ముందు మూడు చిత్రాలు చేసినా అవేవీ కూడా ఈయనకు సక్సెస్ అందించలేదు. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన తాజాగా మేర్లపాక గాంధీతో కామెడీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారు. మేర్లపాక గాంధీ ఇప్పటికే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ , ఎక్స్ప్రెస్ రాజా వంటి కామెడీ జానర్లో సినిమాలు చేశారు. అలాంటి ఈయన హారర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే హ్యాండిల్ చేయగలరా అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు చిన్న టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది.

Advertisement

ALSO READ:Korean Kanakaraju Teaser: కొరియన్ కనకరాజు టీజర్ రిలీజ్.. మాస్ లుక్ లో మెగా ప్రిన్స్!

కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్..

ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తన అద్భుతమైన గెటప్ తో అభిమానులను ఆకట్టుకున్నారు వరుణ్ తేజ్ .ఇందులో సత్య కీలక పాత్ర పోషిస్తుండగా రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా వరుణ్ తేజ్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Related News

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Big Stories

Advertisement
×