E-Paper
Advertisement

BRS On Coal Mines: బొగ్గు గనుల ఇష్యూ.. సీబీఐ విచారణకు బీఆర్ఎస్ డిమాండ్, హైకోర్టుకు హరీష్‌రావు

BRS On Coal Mines: బొగ్గు గనుల ఇష్యూ.. సీబీఐ విచారణకు బీఆర్ఎస్ డిమాండ్, హైకోర్టుకు హరీష్‌రావు
Advertisement

BRS On Coal Mines:  తెలంగాణలో రాజకీయాలు నైని బొగ్గు గనుల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గడిచిన మూడురోజులు దీనిపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పింది బీఆర్ఎస్ పార్టీ. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేత హరీష్‌రావు.

బొగ్గు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు

Advertisement

ఓవైపు ఎన్టీవీ.. ఇంకోవైపు ఏబీఎన్ కథనాలతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. రెండు ఛానెళ్ల కథనాల వెనుక బొగ్గు గనుల ఉన్నాయంటూ ఆరోపణలు లేకపోలేదు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. మా ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని కుండబద్దలు కొట్టేశారు.

కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై అపోహాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. శుక్రచార్యుడు-మారీచుడు-సుబాహుడు బలపడటానికి సహకరిస్తున్నారని కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. ఇలాంటివి రాసే ముందు వివరణ అడిగితే చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం స్వయంగా వెల్లడించారు. పిలిచిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం.

Advertisement

సీబీఐ విచారణకు బీఆర్ఎస్ డిమాండ్ 

ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ నోరు విప్పింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కుంభకోణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి-మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని విమర్శలు గుప్పించారు. సోమవారం ఉదయం మీడియా ముందుకొచ్చిన ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి-బీజేపీకి ఎలాంటి చీకటి ఒప్పందం లేకపోతే నైని కోల్ బ్లాక్ టెండర్లపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిలో 49 శాతం వాటా ఉందని, వెంటనే దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తనవద్దనున్న ఆధారాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు.

ALSO READ: కవితతో ప్రశాంత్ కిషోర్ భేటీ..  బీఆర్ఎస్‌కు ముచ్చెమటలు

రెండేళ్లుగా సింగరేణికి ఒక సీఎండీ లేరని, ఇన్‌ఛార్జ్ ఎండీలను పెట్టి అడ్డగోలుగా నడిపిస్తున్నారని తూర్పార బట్టారు. సైట్ విజిట్ చేసే విధానం గతంలో లేదన్నారు మాజీ మంత్రి. బొగ్గుగని కాంటాక్ట్‌ను బంధువులకు ఇచ్చేందుకు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం ప్రభుత్వం తెచ్చిందన్నారు.

సింగరేణిలో సైట్ విజిట్ విధానం వెంటనే రద్దు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను డిమాండ్ చేశారు. సింగరేణిలో సమర్థవంతమైన అధికారిని నియమించాలని కోరారు. బొగ్గు గనుల కాంటాక్ట్ కోసం IAS అధికారులు-జర్నలిస్టులను బలి పశువులు చేశారన్నారు.

ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించిందే ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ అని, కాంగ్రెస్ భూస్థాపితం అయినప్పుడే NTR ఆత్మ శాంతిస్తుందన్నారు. నైని బ్లాక్ కాంట్రాక్ట్ రద్దు చేయడం సంతోషమని, డిప్యూటీ సీఎం మీద వచ్చిన వార్తల వెనుక ఎవరు ఉన్నారో బయట పెట్టాలన్నారు. లేదంటే జరుగుతున్న వ్యవహారంపై హైకోర్టుకు వెళ్తామని, CBIకి పిర్యాదు చేస్తామన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×