E-Paper
Advertisement

ఆదర్శకుటుంబం.. వెంకీ మామ ఎంట్రీ సీన్ రిలీజ్, ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఆదర్శకుటుంబం.. వెంకీ మామ ఎంట్రీ సీన్ రిలీజ్, ఏకిపారేస్తున్న నెటిజన్స్
Advertisement

Adarsha kutumbam Movie: టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ (Venkatesh) గత కొంతకాలంగా వరుసగా సినిమాలు ప్రకటిస్తూ.. మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. ముఖ్యంగా తోటి హీరోల సినిమాలలో కూడా కీలక పాత్రలు పోషిస్తూ దూసుకుపోతున్న ఈయన.. మరొకవైపు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకొని వరుసగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలా ఇప్పటికే గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వెంకటేష్.. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకున్నారు.

వెంకటేష్ పాత్రను పరిచయం చేసిన ఆదర్శ కుటుంబం టీమ్..

ఇప్పుడు త్రివిక్రమ్(Trivikram ) దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 43’.. సినిమా చేస్తున్నారు. పైగా గురూజీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ మెన్ గా పేరు సంపాదించుకున్న వెంకటేష్ నటించిన తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మేరకు తాజాగా ఆదర్శ కుటుంబం నుండి వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో స్టార్ట్ అవ్వగానే.. ఒక పెద్ద ఇల్లు చూపిస్తారు. అందులో శ్రీనిధి శెట్టి, వెంకటేష్ , కమెడియన్ రఘుబాబులతో వీడియో స్టార్ట్ అవుతుంది.

కామెడీతో నవ్విస్తున్న టీజర్ కట్..

Advertisement

ఆ ఇంట్లోకి వెళ్ళగానే వంటగదిలో ఉన్న ఏసీ రిమోట్ ని చూసి.. శ్రీనిధి శెట్టి ఆశ్చర్యపోయి.. నాన్న వంటగదిలో ఏసి ఉంది. నువ్వు హాయిగా ఏసీ వేసుకొని వంట చేయొచ్చు అంటూ చెబుతుంది. వెంటనే రఘుబాబు వెంకటేష్ వైపు చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. వెంకటేష్ “ఎస్.. ఐ యాం మాన్ అఫ్ ది హౌస్”.. అంటాడు. వాషింగ్ మిషన్ కూడా ఉంది.మీ నీకు పని బాగా తక్కువే అంటూ చెబుతుంది శ్రీనిధి శెట్టి. రఘుబాబు మళ్లీ వెంకటేష్ వైపు చూడడం.. అలా అస్తమానం నా వైపు తిరిగి చూడకుండి మెడ పట్టేస్తుంది. ఇంట్లో ఎవరు ఏ పని చేసినా నాకు నచ్చదు ” అంటూ కామెడీ పండించాడు వెంకటేష్. ఇదంతా చూసిన నారా రోహిత్ ఆదర్శ కుటుంబం అంటూ వెటకారంగా చెప్పే డైలాగ్ మరింత ఆకట్టుకుంటుంది. కట్ చేస్తే చిట్టిబాబు ఫ్యామిలీ.. ముఖం నిండా గాయాలతో ట్రైన్లో నుంచి తొంగి చూస్తున్న పోస్టర్తో వీడియోని కట్ చేశారు. జూలై 28వ తేదీన శ్రీనిధి శెట్టి ఇంట్రడక్షన్ వీడియోని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ALSO READ:ఎన్టీఆర్ మూవీలోకి మరో స్టార్ నటుడు ఎంట్రీ.. ఏ పాత్రలో అంటే!

భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్!

Advertisement

ఇకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. టీజర్ కట్ సూపర్ గా ఉంది .. త్రివిక్రమ్ – వెంకటేష్ మ్యాజిక్ ను ను బిగ్ స్క్రీన్ పై చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అని కామెంట్లు చేస్తే.. మరొకరేమో ఈ ఫస్ట్ లుక్ కి, శ్రీనిధి శెట్టి వెంకీను నాన్న అనడం ఏమైనా సంబంధం ఉందా గురూజీ? అని ప్రశ్నించారు ఇంకొకరు.. అనిల్ రావిపూడి క్రింజ్ లాగా ఉంది అని ఇంకొకరు కామెంట్ చేస్తుంటే.. నీకు ఆ అలవాటు పోలేదా.. ప్రతి మూవీలో ఇలా అందరితో తొంగి చూపిస్తావు.. మొత్తానికి ఎఫ్2ని రీమేక్ చేస్తున్నావు.. ఇంకా ఏదో అనుకున్నానే అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.. మొత్తానికైతే వెంకీ మామ మళ్లీ ఆదర్శ కుటుంబంతో ఆడియన్స్ ను నవ్వించడానికి సిద్ధమైనా.. నెటిజన్స్ మాత్రం పలు చిత్రాలను బయటకు తీస్తూ.. ఏకిపారేస్తున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

 

Related News

రామాయణ కోసం సాయి పల్లవి రెమ్యూనరేషన్?

ఎన్టీఆర్ మూవీలోకి మరో స్టార్ నటుడు ఎంట్రీ.. ఏ పాత్రలో అంటే!

పొలిమేర3 లోకి అడుగుపెడుతున్న యాక్షన్ కింగ్.. వీడియో వైరల్!

నేషనల్ అవార్డు విమర్శలపై ధనుష్ సంచలన వ్యాఖ్యలు!

మెగా కోడలిపై భారీ ట్రోల్స్.. ఫ్యాన్స్ అసహనం!

హీరోయిన్ అనన్య నాగళ్ల నెలకు ఎంత సంపాదిస్తుంది..?

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×