NTR Dragon: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ (NTR) వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్థాయిని అందుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత దేవర సినిమా చేసి సైలెంట్ గా రూ.600 కోట్ల క్లబ్లో చేరి సత్తా చాటారు. ఆ తర్వాత హిందీలో అడుగుపెట్టిన ఈయన.. ‘వార్ 2’ సినిమాతో హిందీ ఆడియన్స్ ను నేరుగా పలకరించారు. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు సలార్, కేజిఎఫ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో.. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఈ మేరకు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ భాజ్ పేయి(Manoj Bajpayee) ఒక కీలక పాత్రలో నటించనున్నారని తాజాగా వినిపిస్తోంది. ఇకపోతే ఇప్పటికే మేకర్స్ ఆయనను సంప్రదించగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే వచ్చే షూటింగ్ షెడ్యూల్లోనే మనోజ్ సినిమా షూటింగ్ సెట్లో అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది . అంతేకాదు దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వెలువబడునున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలుగులో పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించిన మనోజ్ భాజ్ పేయి ఈ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారని చెప్పాలి.
ALSO READ:పొలిమేర3 లోకి అడుగుపెడుతున్న యాక్షన్ కింగ్.. వీడియో వైరల్!
ఈ చిత్రంలో ‘కాంతారా’ హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్గా నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, కొసరాజు హరికృష్ణతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది థియేటర్లలో తీసుకురావడానికి మేకర్స్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ నటుడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచేసింది.
మనోజ్ భాజ్ పేయి నటించిన తెలుగు చిత్రాల విషయానికి వస్తే.. రాంగోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన ప్రేమ కథ అనే చిత్రంలో శంకరం అనే ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత మళ్లీ ఏడేళ్లకు అల్లు అర్జున్ హీరోగా నటించిన హ్యాపీ సినిమాలో డీసీపీ అరవింద్ పాత్రతో ఆకట్టుకున్నారు. 2017లో పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిలిం పులి చిత్రంలో అల్ సలీం అనే పాత్ర పోషించిన ఈయన అదే ఏడాది వేదం సినిమాలో కూడా నటించారు. ఇక మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇంతకాలం తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఈ సినిమాతో మళ్ళీ వరుసగా తెలుగులో అవకాశాలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.