E-Paper
Advertisement

ప్రమోషన్స్ గట్టిగా మొదలుపెట్టిన అనిల్ రావిపూడి.. వీడియో వైరల్!

ప్రమోషన్స్ గట్టిగా మొదలుపెట్టిన అనిల్ రావిపూడి.. వీడియో వైరల్!
Advertisement

Anil Ravipudi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ మెషిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటివరకు 9 చిత్రాలను తెరకెక్కించగా.. ఆ తొమ్మిది చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేసుకోవడం ఒక అరుదైన రికార్డు. అందుకే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ మెషిన్ గా పేరు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. అందులో భాగంగానే గత ఏడాది విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన అనిల్ రావిపూడి.. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసి.. టాలీవుడ్ హిస్టరీ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిపారు.

స్పీడుమీదున్న అనిల్ రావిపూడి..

ముఖ్యంగా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్.. దీనికి తోడు ఫాస్ట్ మేకింగ్.. ఈయనకు బాగా కలిసొస్తున్నాయి. ఇప్పుడు ఒకపక్క వినోదాన్ని పండిస్తూనే.. మరో పక్క తన చిత్రాలతో కాసుల వర్షం కురిపిస్తున్న అనిల్ రావిపూడి.. తన తదుపరి ప్రాజెక్టుతో మరోసారి వార్తల్లో నిలిచారు. అనిల్ రావిపూడి ఈసారి మళ్లీ విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తుండగా.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ని కూడా చేర్చారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందుతున్న ఈ కాంబినేషన్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్..

Advertisement

సాధారణంగా ఏ దర్శకుడైనా సరే.. తన సినిమా విడుదల తేదీకి దగ్గర పడుతున్న సమయంలోనే.. ప్రమోషన్స్ మొదలుపెడతారు. అయితే అనిల్ రావిపూడి మాత్రం ఈసారి తన రూట్ సపరేట్ అంటూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇటీవలే పూజ కార్యక్రమాలతో చాలా గ్రాండ్ గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే . అప్పుడే తన మొదటి షెడ్యూల్ ని కూడా అత్యంత వేగంగా పూర్తి చేశారు. అనిల్ రావిపూడి ఈ విషయాన్ని మేకర్స్ ఒక అఫీషియల్ వీడియో రూపంలో అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఇంత స్పీడ్ ఏంటి స్వామి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

also read:జన నాయగన్ టీమ్ మోసం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటి.. వీడియో వైరల్!

వీడియో రిలీజ్ చేస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరిచిన డైరెక్టర్..

Advertisement

సాధారణంగా ఒక స్టార్ హీరోతో సినిమా చేయడమే కత్తి మీద సాము లాంటిది. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలతో.. అందులోనూ మల్టీ స్టారర్ సినిమాను మేనేజ్ చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే అనిల్ రావిపూడి మాత్రం ఏమాత్రం టెన్షన్ లేకుండా.. తడబాటు పడకుండా అందరికంటే ముందే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసేసాడు. ఇక ఈ ఫస్ట్ షెడ్యూల్ లోనే వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో పాటు ఇద్దరు క్రేజీ హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొనడం మరో విశేషం. ఏది ఏమైనా ఒకేసారి ఇంత పెద్ద భారీ స్టార్ క్యాస్టింగ్ ను సెట్స్ మీద హ్యాండిల్ చేస్తూ క్వాలిటీ తగ్గకుండా.. పక్కా ప్లానింగ్ తో పనులు పూర్తి చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు అనిల్ రావిపూడి.

అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా..

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా సెట్ పైకి వెళ్లకముందే అటు బిజినెస్ పరంగా కూడా భారీ క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీ, థియేట్రికల్ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు అందర్నీ తన సినిమాలతో ఎంటర్టైన్ చేసే అనిల్ రావిపూడి.. ఈసారి రాబోయే ఈ చిత్రంతో ఇంకెలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి

Related News

నాని చేతులు దాటిపోతున్న ‘ది ప్యారడైజ్’? అసలు లోపల ఏం జరుగుతోంది!

జబర్దస్త్ వర్ష సంపాదన చూసి నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్!

జన నాయగన్ టీమ్ మోసం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటి.. వీడియో వైరల్!

మళ్లీ తప్పని నిరాశ.. ఆఖరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా!

నన్ను మోసం చేశారు.. ఫస్ట్ రెమ్యూనరేషన్ పై విజయశాంతి కామెంట్!

జననాయగన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలుగులో ఎన్ని కోట్లంటే?

ప్రధానిని కూడా వదలని ప్రకాష్ రాజ్.. భయపడ్డారంటూ సెటైరికల్ పోస్ట్!

Big Stories

Advertisement
×