E-Paper
Advertisement

నోకియా కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 19 రోజులు నాన్ స్టాప్!

నోకియా కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 19 రోజులు నాన్ స్టాప్!
Advertisement

Nokia 123 Shield: నోకియా నుంచి మరో సరికొత్త కీప్యాడ్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. నోకియా మాతృ సంస్థ హెజ్ఎండీ ‘నోకియా 123 షీల్డ్’ పేరుతో దీనిని అధికారికంగా విడుదల చేసింది. అయితే ఇటీవలే హెచ్ఎండీ.. ఏఐ ఫీచర్లతో పనిచేసే అధునాతన ‘నోకియా 200’ సిరీస్ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు వాటికి భిన్నంగా 1990ల కాలం నాటి లుక్స్, ఫీచర్లతో రఫ్ అండ్ టఫ్ ‘నోకియా 123 షీల్డ్’ ను తీసుకురావడం గమనార్హం. ఈ ఫోన్ కు సంబంధించిన ప్రధాన ఫీచర్లేంటో ఇప్పుడు చూద్దాం.

USB టైప్-సి ఛార్జింగ్

నోకియా 123 షీల్డ్ ఫోన్.. దృఢమైన ప్లాస్టిక్ బాడీతో వచ్చింది. నీరు, దుమ్ము, దూళి లోపలికి వెళ్లకుండా.. ఈ ఫోన్ పోర్టులపై రబ్బర్ ఫ్లాప్‌లను అమర్చారు. అంతేకాకుండా ఈ ఫీచర్ ఫోన్ కు.. IP65 రేటింగ్ కూడా అందించారు. కాబట్టి వర్షంలో తడిసినా ఎలాంటి సమస్య ఉండదని నోకియా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో మాయమైపోతున్న 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఫీచర్ ను దీనికి ఇచ్చారు. అలాగే లేటెస్ట్ USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను ఈ ఫోన్ కు ఇవ్వడం గమనార్హం.

ప్రాసెసర్, స్టోరేజ్ డీటైయిల్స్

Advertisement

ఈ సరికొత్త నోకియా ఫోన్.. యునిసోక్ SC6531E ప్రాసెసర్‌పై పనిచేయనుంది. ఇందులో 4MB ర్యామ్, 4MB ఇంటర్నల్ స్టోరేజ్ ను మాత్రమే అందించారు. ఫోటోలు, పాటలు సేవ్ చేసుకోవడానికి మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకునే వెసులుబాటును కల్పించారు. మరోవైపు ఫోన్ వెనుక భాగంలో సాధారణ కెమెరా, ఫ్లాష్ లైట్ ను సైతం ఇవ్వడం విశేషం.

అద్భుతమైన బ్యాటరీ లైఫ్

ఈ నోకియా ఫోన్ లో ప్రధాన ఆకర్షణగా బ్యాటరీ లైఫ్ ను చెప్పుకోవచ్చు. 1750mAh రిమూవబుల్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 19 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ను అందించనుంది. అలాగే 27.9 గంటల టాక్‌టైమ్‌ను ఈ బ్యాటరీ ద్వారా పొందొచ్చని హెచ్ఎండీ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ ఫోన్.. హెచ్ఎండీకి చెందిన S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ కానుంది. వైర్డ్, వైర్‌లెస్ పద్ధతిలో పనిచేసే FM రేడియోకు ఇది సపోర్ట్ చేస్తుంది.

2G నెట్ వర్క్ మాత్రమే..

Advertisement

నోకియా 123 షీల్డ్ ఫోన్.. కేవలం 2G నెట్‌వర్క్, డ్యూయల్ మినీ సిమ్‌లకు మాత్రమే సపోర్ట్ చేయనుంది. ఇటీవల వచ్చిన నోకియా 200 సిరీస్ 4Gకి సపోర్ట్ ఇస్తుంటే.. దీనికి మాత్రం 2G మాత్రమే ఇవ్వడం కాస్త మైనస్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చాలా దేశాల్లో 2G సేవలు నిలిచిపోతున్న తరుణంలో అదే పాత ఫీచర్ తో నోకియా కొత్త ఫోన్ రావడం.. టెక్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Also Read: జియో ‘ఫ్రీడమ్ ప్యాక్’ ఆఫర్.. 100 Mbps స్పీడ్, 1000+ ఛానెళ్లు.. ఫ్రీగా 12 ఓటీటీలు!

మరి ధర సంగతేంటి?

నోకియా 123 షీల్డ్ ఫోన్ ను హెచ్ఎండీ లాంచ్ చేసినప్పటికీ.. దాని ధర, సేల్స్ ను ప్రారంభించే తేదీని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఫోన్ ఫీచర్లను బట్టి చూస్తే.. నోకియా 200 4G సిరీస్ కంటే తక్కువకే ఇది లభించనుంది. అంటే రూ.2500 నుంచి రూ.3500 మధ్య దీని ధర ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రఫ్ అండ్ టఫ్ వినియోగానికి, ఎక్కువ రోజుల బ్యాటరీ లైఫ్ కు మంచి ఫీచర్ ఫోన్ కోరుకుంటే.. దీనిని ట్రై చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఓరి దేవుడా.. భారీగా తగ్గిన గెలాక్సీ Z Fold 7 ధర.. కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్!

Related News

బాక్స్ ఓపెన్ చేయగానే మైండ్ పోయింది.. ఐఫోన్ ప్లేస్‌లో ఆయిల్ డబ్బా, ఫ్లిప్‌కార్ట్‌కు ఇచ్చిపడేసిన కోర్టు!

రూ.18 వేలకే క్యూఎల్ఈడీ, ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు.. లైనప్‌లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

ఓరి దేవుడా.. భారీగా తగ్గిన గెలాక్సీ Z Fold 7 ధర.. కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్!

జియో ‘ఫ్రీడమ్ ప్యాక్’ ఆఫర్.. 100 Mbps స్పీడ్, 1000+ ఛానెళ్లు.. ఫ్రీగా 12 ఓటీటీలు!

సామాన్యుల స్పెషల్.. BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. 72 రోజులు రచ్చ రంబోలా!

జియో మరో క్రేజీ ప్లాన్.. రూ. 1,748 కే 11 నెలల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, డేటా, లైవ్ ఛానల్స్!

జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ. 400 లోపే అన్‌లిమిటెడ్ 5G డేటా.. వివరాలివే!

Big Stories

Advertisement
×