E-Paper
Advertisement

Venkatesh: ఎప్పుడూ సంక్రాంతికి వస్తాం.. ధనాధన్ ఇస్తూనే ఉంటాం : వెంకటేష్

Venkatesh: ఎప్పుడూ సంక్రాంతికి వస్తాం.. ధనాధన్ ఇస్తూనే ఉంటాం : వెంకటేష్
Advertisement

Venkatesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్ ఇటీవల కాలంలో వరుస సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. ఇక ఇటీవల వెంకటేష్ సోలో సినిమాలు కాకుండా స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇతర హీరోల సినిమాలలో క్యామియో పాత్రలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా గతంలో వరుణ్ తేజ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో కలిసి కూడా స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే . అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నయనతార జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

వెంకీ గౌడగా వెంకటేష్..

ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో వెంకీ గౌడ అనే పాత్రలో విక్టరీ వెంకటేష్ నటించిన విషయం తెలిసిందే. ఇలా వెంకటేష్ చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ సక్సెస్ ఈవెంట్లో వెంకటేష్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

సంక్రాంతికి వస్తాం.. హిట్ కొడతాం..

Advertisement

ముందుగా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసిన ఆడియన్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సినిమాలో తనని భాగం చేసినందుకు అనిల్ రావిపూడి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా మన బాస్ రికార్డులు బద్దలు కొట్టారు అంటూ ఈ సినిమా విజయంపై ప్రశంసల కురిపించారు .అయితే ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి గురించి వెంకటేష్ మాట్లాడుతూ అందరికీ అభినందనలు తెలిపారు. ఇక ఈ వేడుకలో వెంకటేష్ చివరిగా మాట్లాడుతూ.. ఎప్పుడు సంక్రాంతికి వస్తూనే ఉంటాం ధనాధన్ ఇచ్చేస్తూ ఉంటాం అంటూ తన స్పీచ్ ముగించారు.

youtube.com/live/jhCZDh17SPI

Advertisement

ఇలా ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా తన సినిమా ఉంటుందని అలాగే ఆ సినిమాతో సక్సెస్ అందుకుంటాము అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక గత ఏడాది అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా మన శంకర్ వరప్రసాద్ గారితో సక్సెస్ అందుకున్నారు. ఇక వచ్చే ఏడాది వెంకటేష్ మళ్లీ అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. మళ్ళీ సంక్రాంతికి వస్తాం…హిట్ కొడతాము అంటూ వెంకటేష్ మాట్లాడటంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కన్ఫామ్ అయినట్టేనని అభిమానులు భావిస్తున్నారు.

Also Read: Chiranjeevi: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై చిరు కామెంట్స్.. ఇండస్ట్రీ అద్దంలాంటిదంటూ!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×