SA20 Final 2026: సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ 2026 టోర్నమెంట్ ( South Africa’s premier T20 cricket league) చాలా రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం రోజున ఈ టోర్నమెంట్ కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు (Sunrisers Eastern Cape ) ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో 2026 సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో ఛాంపియన్ గా నిలిచింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్. ఈ ఫైనల్ మ్యాచ్ లో ప్రిటోరియా క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ( SA20 Final Pretoria Capitals vs Sunrisers Eastern Cape ) జట్లు తలపడ్డాయి. అయితే, 159 పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ ముందు ఉంచింది ప్రిటోరియా క్యాపిటల్స్. అయితే ఈ లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది కావ్య పాప టీం. దీంతో 6 వికెట్ల తేడాతో ఫైనల్స్ లో విజయం సాధించింది సన్ రైజర్స్. ఈ విజయంతో 2026 సౌత్ ఆఫ్రికా T20 లీగ్ ఛాంపియన్ గా నిలిచింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్. ఇప్పటికే రెండు టైటిల్స్ అందుకున్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ఇప్పుడు మూడవ టైటిల్ కూడా సొంతం చేసుకుంది.
సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో ముచ్చటగా మూడవసారి టైటిల్ గెలిచింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్. ఇప్పటికే 2023 సీజన్ ప్రారంభంలో 2024లో టైటిల్ గెల్చుకుంది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్. 2025 ఫైనల్స్ వరకు వెళ్లి సన్రైజర్స్ ఓడిపోయింది. ఆ సమయంలో ముంబై చేతులు ఓడిపోవలసి వచ్చింది సన్రైజర్స్. ఇక ఇప్పుడు ప్రిటోరియా ను చిత్తు చేసి మూడోసారి టైటిల్ గెలుచుకుంది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్. ప్రిటోరియ క్యాపిటల్స్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో మాథ్యూ బ్రీట్జ్కే, స్టబ్స్ అద్భుతంగా రానించి జట్టును విజయతీరాలకు చేర్చారు. చివరలో సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు స్టబ్స్.
కేప్ టౌన్ లోని న్యూల్యాండ్స్ ( Newlands, Cape Town ) వేదికగా సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ప్రిటోరియా క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (Pretoria Capitals vs Sunrisers Eastern Cape ) మధ్య ఫైనల్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ మొదటి బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ (Pretoria Capitals ) పడుతూ లేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది. ఈ ప్రిటోరియ క్యాపిటల్స్ జట్టులో ప్లేయర్లు అందరూ విఫలమైనప్పటికీ కుర్ర క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన డెవాల్డ్ బ్రెవిస్ ( Dewald Brevis) అద్భుతంగా రానించాడు. 56 బంతుల్లో 101 పరుగులు సాధించి ఇరగదీశాడు. ఇందులో 7 సిక్సర్లు అలాగే 8 బౌండరీలు ఉన్నాయి. 180 స్ట్రైక్ రేటుతో సన్రైజర్స్ జట్టుకు చుక్కలు చూపించాడు డెవాల్డ్ బ్రెవిస్. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ, మరోవైపు తన బ్యాటింగ్ అద్భుతంగా కొనసాగించాడు. తన సత్తా చాటాడు. మరో ఏబీ డివీలియర్స్ అని డెవాల్డ్ బ్రెవిస్ నిరూపించుకున్నాడు.
🚨 SUNRISERS EASTERN CAPE HAVE WON THE SA20 2026 TROPHY 🚨
– 3rd Trophy for Sunrisers Eastern in SA20..!!!! 🏆 pic.twitter.com/l0A64j7nXQ
— Tanuj (@ImTanujSingh) January 25, 2026