E-Paper
Advertisement

‘ఆదర్శ కుటుంబం’ క్రేజీ లీక్….త్రివిక్రమ్ సెంటిమెంట్ రిపీట్!

‘ఆదర్శ కుటుంబం’ క్రేజీ లీక్….త్రివిక్రమ్ సెంటిమెంట్ రిపీట్!
Advertisement

Adarsha Kutumbam:  2001లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’,2002లో వచ్చిన ‘వాసు’,2004 నాటి ‘మల్లీశ్వరి’..ఈ మూడు సినిమాలు చాలు త్రివిక్రమ్ రాసిన పదాలు వెంకీ మామ నోటి నుండి ఏ రేంజ్ లో పేలుతాయో చెప్పడానికి.అలాంటిది వెంకీ మామని త్రివిక్రమ్ ఏకంగా డైరెక్ట్ చేస్తే …అదిగో అలా దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ ని మురిపిస్తూ ‘ఆదర్శ కుటుంబం’ అనే క్రేజీ టైటిల్‌తో మూవీ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చకచకా సాగుతోంది కూడా .

సెకండ్ హీరోయిన్‌గా నివేతా పేతురాజ్

Advertisement

ఇక ఈ భారీ ఫ్యామిలీ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో కన్నడ బ్యూటీ, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, తాజాగా ఈ ప్రాజెక్టులోకి మరో గ్లామరస్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చిందట. యస్ .ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నివేతా పేతురాజ్ కీలక పాత్ర పోషించబోతోందని తెలుస్తుంది. ఇందులో ఆమె ఒక పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుందని ఇన్ సైడ్ టాక్.

అల్లు అర్జున్ మరదలిగా  మెప్పించిన నివేతా 

Advertisement

ఇక నివేతా పేతురాజ్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడం ఇది రెండోసారి. అంతకుముందు 2020 సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో అల్లు అర్జున్ మరదలిగా ఆమె నటించి మెప్పించింది.ఆ సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత కొంతకాలంగా వెండితెరపై పెద్దగా కనిపించని నివేతకు, ‘ఆదర్శ కుటుంబం చిత్రం టాలీవుడ్‌లో ఒక గట్టి కమ్‌బ్యాక్ అవుతుందని, ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుందని లెక్కలేసే పనిలో పడ్డారు ట్రేడ్ పండిట్స్ .

also read :ఫస్ట్‌ టైం రివ్యూ..ఏలియన్స్.. కిడ్నాప్ డ్రామా.. ‘ఫస్ట్ టైం’ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?

ప్రతి సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ ఆప్షన్‌

ఇక దర్శకుడిగా త్రివిక్రమ్ కెరీర్ గ్రాఫ్‌ను గమనిస్తే, ఆయన తన కెరీర్ ప్రారంభంలో కేవలం సింగిల్ హీరోయిన్ కథలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. 2002లో వచ్చిన ‘నువ్వే నువ్వే’, 2005 నాటి క్లాసిక్ ‘అతడు’, అలాగే మహేష్ బాబుతో తెరకెక్కించిన ‘ఖలేజా’ వంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ అనే కాన్సెప్ట్ ఎక్కడా కనిపించదు. కానీ, ఆ తర్వాత త్రివిక్రమ్ తన మేకింగ్ స్టైల్ మార్చారు. ‘అ ఆ’, ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత వీర రాఘవ’ నుంచి మొన్నటి ‘గుంటూరు కారం’ వరకు ప్రతి సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ ఆప్షన్‌ను ఖచ్చితంగా పెడుతున్నారు. అయితే ‘అ ఆ’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ పాత్రకు దక్కినంత స్క్రీన్ స్పేస్ మరియు ప్రాధాన్యత, మిగిలిన చిత్రాల్లోని సెకండ్ హీరోయిన్లకు పెద్దగా దక్కలేదు. మరి ఈ ‘ఆదర్శ కుటుంబం’ లో నివేతా పేతురాజ్ పాత్రకు త్రివిక్రమ్ ఎలాంటి స్కోప్ ఇచ్చారో రిలీజ్ అయితే కాని తెలీదు.

హర్షవర్ధన్ రామేశ్వర్‌ ప్లేసులో ఎస్.ఎస్. తమన్?

ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్. మొదట ఈ ప్రాజెక్ట్ కోసం ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్‌ను అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల త్రివిక్రమ్ ఆస్థాన సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ రంగంలోకి దిగాడని సమాచారం. ప్రస్తుతం తమన్ ఆధ్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వెంకీ-త్రివిక్రమ్ సినిమా కాబట్టి ఆల్బమ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే మే చివరి నాటికి, అంటే వేసవి ముగిసేలోపు గుమ్మడికాయ కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

దసరా కానుకగా విడుదల

ఇక సినిమాను ఈ ఏడాది అక్టోబర్ దసరా కానుకగా విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ, మేకర్స్ ఇప్పుడప్పుడే అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే మూడ్‌లో లేరని,పోస్ట్ ప్రొడక్షన్ పనులని దృష్టిలో ఉంచుకుని, కొద్దిగా సమయం తీసుకుని ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. చూడాలి మరి ఈ సెకండ్ హీరోయిన్ అ ఆ లో అనుపమ లా పేలుతుందా..లేక గుంటూరు కారం లో మీనాక్షిలా తుస్సుమంటుందా !

also read :‘దేవర 2’కు ఎన్టీఆర్ గుడ్ బై? అందుకోసమే కొరటాలను పక్కన పెట్టేసారా!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×