E-Paper
Advertisement

నాగన్‌పల్లిలో విషాదం.. వడదెబ్బకు 8 ఏళ్ల చిన్నారి బలి

నాగన్‌పల్లిలో విషాదం.. వడదెబ్బకు 8 ఏళ్ల చిన్నారి బలి
Advertisement

Naganpalli: కంగ్టి మండలం నాగన్‌పల్లి గ్రామంలో గుండెల్ని పిండేసే విషాదం జరిగింది. నిన్నటివరకు తమ కళ్లముందే నవ్వుతూ, ఆడుతూ తిరిగిన ఎనిమిదేళ్ల చిన్నారి కీర్తిక.. వడదెబ్బకు బలైపోతుందనని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు. ఎండల తీవ్రత ఒక ప్రాణాన్ని బలితీసుకోవడం స్థానికంగా అందరినీ తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.

స్వగ్రామానికి చెందిన సంజీవ్ కుమార్తె కీర్తిక గురువారం పగలంతా ఇంట్లోనే ఎంతో ఉల్లాసంగా గడిపింది. అయితే రాత్రి అయ్యేసరికి ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. తీవ్రమైన జ్వరం రావడంతో పాటు శరీరం పూర్తిగా నీరసించిపోయింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

Advertisement

అక్కడ వైద్యులు చిన్నారిని బ్రతికించడానికి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కీర్తిక కన్నుమూసింది. చిన్నారి మరణవార్త వినగానే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించడం చూసి అక్కడున్న వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. నిన్నటివరకు తమ మధ్యే తిరిగిన పాప ఇక లేదనే సరికి నాగన్‌పల్లి గ్రామం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Also Read: మనిషి పుట్టుకకు కారణం డైనోసార్ల చావేనా? శాస్త్రవేత్తలు చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×