E-Paper
Advertisement

Yellama Glimpse: దేవి శ్రీ హీరోగా ఎల్లమ్మ గ్లింప్స్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తుందిగా?

Yellama Glimpse: దేవి శ్రీ హీరోగా ఎల్లమ్మ గ్లింప్స్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తుందిగా?
Advertisement

Yellama Glimpse: జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు(Venu) ప్రస్తుతం దర్శకుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈయన ఇటీవల బలగం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. బలగం సినిమా ద్వారా ఎన్నో అవార్డులను పురస్కారాలను సొంతం చేసుకున్న వేణు తన రెండో సినిమాని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. బలగం సినిమా దిల్ రాజు కుమార్తె నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో ఈయన రెండో సినిమాని దిల్ రాజు బ్యానర్ లో చేసే అవకాశాన్ని అందుకున్నారు. వేణు డైరెక్షన్ లో తన రెండవ సినిమాని ఎల్లమ్మ (Yellamma)సినిమాగా ప్రకటించారు.

హీరోగా దేవి శ్రీ ప్రసాద్..

ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా హీరో దొరకని నేపథ్యంలో ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమాకు ముందుగా నానిని హీరో అనుకున్నారు. నాని తప్పుకోవడంతో నితిన్, వంటి పలువురు హీరోలు ఈ సినిమాకు కమిట్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో హీరో కారణంగానే ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక చివరికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ను హీరోగా పరిచయం చేస్తూ ఎల్లమ్మ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెల్లడించలేదు. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ విడుదల చేశారు.

అద్భుతమైన విజువల్స్..

Advertisement

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన ఈ గ్లింప్స్ విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేస్తూ విడుదలైన ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు తన మ్యూజిక్ ద్వారా అందరిని మెస్మరైస్ చేసిన దేవిశ్రీప్రసాద్ హీరోగా తెరపై ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా నుంచి ఈ వీడియో వైరల్ గా మారడంతో రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తదితర వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాకు దిల్ రాజు , శిరీష్ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయాలను కూడా వెల్లడించనున్నారు. ఇదివరకు ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ స్వయంగా ఈ వార్తలను కీర్తి సురేష్ ఖండించడంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. త్వరలోనే హీరోయిన్ కి సంబంధించిన వివరాలు కూడా వెల్లడి కానున్నాయి.

Related News

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

Big Stories

Advertisement
×