E-Paper
Advertisement

Venu Swamy: సమంత రెండో పెళ్లిపై వేణు స్వామి కామెంట్స్.. ఈ ట్విస్ట్ ఏందీ సామి!

Venu Swamy: సమంత రెండో పెళ్లిపై వేణు స్వామి కామెంట్స్.. ఈ ట్విస్ట్ ఏందీ సామి!
Advertisement

Venu Swmay : వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఒకానొక సమయంలో ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి జాతకాలను చెబుతూ ఎన్నో వివాదాలు చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు రాజకీయాలకు చెందిన వారి జాతకాలను చెప్పడం పూర్తిగా తగ్గించారనే చెప్పాలి. అలాగే వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం కూడా విఫలం కావడంతో ఈయన ఇలాంటి వివాదాలకు కూడా దూరమయ్యారు.

సమంత రాజ్ పెళ్లి పై వేణు స్వామి కామెంట్స్..

ఇకపోతే తాజాగా సమంత(Samantha) దర్శకుడు రాజ్ (Raj) ను రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం గురించి ఇప్పటికే ఎంతోమంది జ్యోతిష్యులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే వేణు స్వామి కూడా సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా వేణు స్వామి మాట్లాడుతూ తనకు ఉదయం నుంచి ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయని సమంత రెండో పెళ్లి చేసుకుంది కదా తన జీవితం ఎలా ఉండబోతోంది అంటూ పదేపదే ప్రశ్నలు వేస్తున్నారు. ఇలా ఫోన్స్ చేసిన వారందరికీ తాను ఒకటే చెబుతున్నానని తెలిపారు..

సమంత పెళ్లి గురించి ఎవరు అడగమన్నారు?

Advertisement

గత 12 నెలల క్రితం నాగచైతన్య శోభిత పెళ్లి గురించి మాట్లాడటంతో ఎంతో మంది మిమ్మల్ని ప్రశ్నించారు. వారి జాతకం గురించి ఎవరు మిమ్మల్ని అడిగారనీ మాట్లాడారు. అయితే ఇప్పుడు సమంత రాజ్ పెళ్లి గురించి మీడియా ఛానళ్లను కొంతమంది జ్యోతిష్యుల దగ్గరకు వెళ్లి మైకులు ఇచ్చి మరి వీరి పెళ్లి గురించి అడుగుతున్నారు. సమంత అడిగిందా? లేదా రాజ్ అడిగారా?ఎవరు అడిగారని వారి పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు ఈ విషయంపై మీరు ఏమైనా స్పందిస్తారా అంటూ నన్ను చాలామంది ఫోన్ చేసి అడిగారు.

Advertisement

నేను ఇలాంటి విషయాల గురించి అసలు ప్రస్తావించదల్చుకోలేదని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద డైరెక్టర్ వారి సినిమా హిట్ కావాలని నాతో పూజలు చేయిస్తున్నారు. మూడు రోజులపాటు ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మీడియా వారు ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వారిని నాశనం చేయాలంటే ఒక లాగా, ఒకరిని పైకి లేపాలంటే మరోలాగా చూపించుకుంటూ ఉంటారు. ఈ విషయాలు గురించి తాను పట్టించుకోలేదని కేవలం నా పనులలో నేను బిజీగా ఉన్నాను అంటూ వేణుస్వామి మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా సమంత రెండో పెళ్లి గురించి వేణు స్వామి ఒక ముక్క కూడా మాట్లాడకపోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. బహుశా వేణు స్వామి గతంలో నాగచైతన్య రెండో పెళ్లి గురించి మాట్లాడి వివాదాలలో చిక్కుకున్న నేపథ్యంలోనే సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

Also Read: Samantha – Raj Nidimoru: సమంత రాజ్ పెళ్లి.. అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన కొత్త జంట!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×