E-Paper
Advertisement

Samantha – Raj Nidimoru: సమంత రాజ్ పెళ్లి.. అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన కొత్త జంట!

Samantha – Raj Nidimoru: సమంత రాజ్ పెళ్లి.. అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన కొత్త జంట!
Advertisement

Samantha Raj Nidimoru: సినీ నటి సమంత (Samantha)దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) డిసెంబర్ ఒకటవ తేదీ ఈషా ఫౌండేషన్ లోని యోగ ఆశ్రమంలో ఉన్న లింగ బైరవి ఆలయంలో భూతశుద్ధం వివాహ పద్ధతిలో రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచి ఏకంగా పెళ్లి చేసుకొని తమ పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇలా సమంత నిన్న ఉదయం వివాహం చేసుకోవడంతో నిన్న మధ్యాహ్నం ఈ పెళ్లి విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ వీరి పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. సమంత పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రిటర్న్ గిఫ్ట్ గా ఆల్కెమిస్ట్ బ్రాండ్ పెర్ఫ్యూమ్..

సమంత చాలా సింపుల్ గా సాంప్రదాయబద్ధంగా వివాహాన్ని జరుపుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ వివాహ వేడుకకు కేవలం తక్కువ మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. ఇలా ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను సమంత స్నేహితురాలు శిల్పారెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే సమంత పెళ్లిలో భాగంగా పెట్టిన ఫుడ్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కి సంబంధించి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఈషా పూల నుండి తయారు చేసిన అగరబత్తులు, ఇండియాలో తయారుచేసిన చాక్లెట్ బార్లు, ఇటీవల సమంత ప్రారంభించిన సీక్రెట్ ఆల్కెమిస్ట్ బ్రాండ్ పెర్ఫ్యూమ్ తో పాటు సద్గురు సందేశాన్ని కూడా ఈమె రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తోంది.

అరటి ఆకు భోజనాలు..

Advertisement

ఇక సమంత పెళ్లిలో భోజనాలకు సంబంధించి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. సమంత వివాహంలో భాగంగా అరటి ఆకు భోజనాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.ఇందులో భాగంగా అన్నం ,పప్పు ,క్యారెట్ బీన్స్ పులావ్, రాగి ముద్ద, బ్రౌన్ రైస్, పలు రకాల స్వీట్స్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఇలా సమంత పెళ్లి ఎలా జరిగింది ఏంటి అనే విషయాలను తన స్నేహితురాలు శిల్పారెడ్డి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్న ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నటిగా, నిర్మాతగా సమంత..

Advertisement

ఇలా సమంత సడన్ గా పెళ్లి చేసుకుని పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత ఇలా కొత్త జీవితాన్ని ప్రారంభించిన నేపథ్యంలో తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉండాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఈమె కెరియర్ పరంగా బిజీ అవుతూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. సినిమాల విషయానికొస్తే నిర్మాతగా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సమంత సొంత బ్యానర్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: Allu Arjun Spirit : ప్రభాస్ స్పిరిట్ మూవీ… 15 ఏళ్ల క్రితమే హింట్ ఇచ్చిన అల్లు అర్జున్

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×