E-Paper
Advertisement

Tata Xpres Petrol CNG Car: టాటా నుంచి మరో రెండు క్రేజీ కార్లు, ధర ఎంతో తెలుసా?

Tata Xpres Petrol CNG Car: టాటా నుంచి మరో రెండు క్రేజీ కార్లు, ధర ఎంతో తెలుసా?
Advertisement

టాటా మోటార్స్ మరో రెండు ప్యాసింజర్ వెహికల్స్ ను పరిచయం చేసింది. Tata Xpres పేరుతో పెట్రోల్, సిఎన్‌జి వేరియంట్లను తీసుకొచ్చింది. ఈ కార్లతో టాటా మోటార్స్ ఫ్లీట్ ఫోకస్డ్ పోర్ట్‌ ఫోలియోను బలోపేతం చేయాలని భావిస్తోంది.  దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య రవాణా మార్కెట్‌ లో విస్తృత శ్రేణి ప్రొఫెషనల్ మొబిలిటీ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా వీటిని విడుదల చేసింది. టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ క్యాబ్ వెర్షన్ గా Tata Xpresను విడుదల చేసింది.

Tata Xpres ధరల గురించి..

Tata Xpres పెట్రోల్ వెర్షన్ ధర రూ.5.59 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. CNG వేరియంట్ ధర కాస్త ఎక్కువగా ఉంది. రూ. 6.59 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఆన్ రోడ్ విషయానికి వచ్చే సరికి ధర కాస్త ఎక్కువ అవుతుంది. ఇప్పటికే అధికారిక ఫ్లీట్ డీలర్‌ షిప్‌ లలో బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. ఈ కార్లు ఫ్లీట్ ఆపరేటర్లకు ఎక్కువ సమయం, ఖర్చును బాగా ఆదా చేస్తుంది.

Advertisement

ఈ రెండు కొత్త వేరియంట్లు 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా పవర్ ను పొందుతాయి. మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్‌ తో అందుబాటులో ఉన్నాయి. ఫ్లీట్ వినియోగం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన XPRES శ్రేణి  వినియోగదారులకు లాభసాటిగా ఉంటుంది. ఈ విభాగంలో మొదటిది 70 లీటర్ల సామర్థ్యం కలిగిన ట్విన్ సిలిండర్ CNG ప్యూయెల్ ట్యాంక్ ను కలిగి ఉంటుంది. పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ కారణంగా తరచుగా పెట్రోల్ బంక్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సమయాన్ని బాగా ఆదా చేస్తుంది.

మంచి బూట్ స్పేస్ తో.. 

ఇది సాంప్రదాయ CNG సెడాన్‌ల మాదిరిగా కాకుండా, XPRES CNG మంచి బూట్ ప్లేస్ ను అందిస్తుంది. పరిమిత లగేజీ సామర్థ్యం కారణంగా తరచుగా బుకింగ్‌లను కోల్పోయే ఆపరేటర్లకు ఈ కారు ఉపయోగకరంగా ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ 419 లీటర్ల బూట్ ప్లేస్ ను కలిగి ఉంటుంది.

Advertisement

Read Also:  ఆటో9 అవార్డ్స్ 2026.. ఈవీ స్కూటర్ ఆఫ్ ది ఇయర్ గా సత్తా చాటిన టీవీఎస్ ఆర్బిటర్!

ఇక కొత్త XPRES పెట్రోల్, CNG 3 సంవత్సరాలు, 1,00,000 కి.మీ ప్రామాణిక వారంటీతో అందుబాటులో ఉన్నాయి. దీనిని 5 సంవత్సరాలు, 1,80,000 కి.మీ వరకు పొడిగించుకుఏ అవకాశం ఉంటుంది. కి.మీ.కు కేవలం రూ.0.47 ఖర్చు అవుతుంది.   టాటా మోటార్స్ XPRESను మార్కెట్లో అత్యంత చౌకైన ఫ్లీట్ సెడాన్‌లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకోనుంది.

అటు, టాటా మోటార్స్ ఎంపిక చేసిన నగరాల్లో ప్రత్యేకమైన ఫ్లీట్ కేంద్రీకృత డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. ఈ అవుట్‌ లెట్లు   అమ్మకాలతో పాటు సర్వీసింగ్ సపోర్టును అందించడానికి అందుబాటులోకి తీసుకురాబడ్డాయి. వేగవంతమైన టర్నరౌండ్ టైమింగ్స్, హైయ్యర్ వెహికిల్ ఎబిలిటీ, వెహికిల్ లైఫ్ సర్కిల్ కు సంబంధించి సపోర్టును అందించనున్నాయి.

Read Also: ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. చౌకైన ఆటో మేటిక్ కారు ఇదే!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×