E-Paper
Advertisement

బాలయ్య కోసం బాలీవుడ్ భామ.. కొరటాల క్రేజీ థాట్!

బాలయ్య కోసం బాలీవుడ్ భామ.. కొరటాల క్రేజీ థాట్!
Advertisement

Balakrishna : నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో వరుస హిట్‌లతో జోరు మీదున్నారు. తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో ఆయన చేయబోతున్న ‘NBK 112’ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా బాలీవుడ్ వెర్సటైల్ నటి విద్యాబాలన్‌ను ఎంపిక చేయాలనే కొరటాల క్రేజీ ప్లాన్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చే సీన్లు సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి..

మళ్లీ సెట్ కానున్న హిట్ కాంబో:

బాలయ్య, విద్యాబాలన్ గతంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ సినిమాల్లో జంటగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్-బసవతారకం పాత్రల్లో వారిద్దరి నటనకు, హుందాతనానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత, కొరటాల శివ ఈ హిట్ జోడీని మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయించడానికి సిద్ధమవుతున్నారు. ఇక విద్యాబాలన్ వంటి నేచురల్ నటి తోడైతే సినిమా స్థాయి జాతీయ స్థాయికి వెళ్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

దేవర తర్వాత కొరటాల స్కెచ్:

Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘దేవర’ వంటి భారీ విజయాన్ని అందుకున్న కొరటాల శివ, ఇప్పుడు తన ఫోకస్ అంతా బాలయ్య సినిమాపైనే పెట్టారు. మే 1న ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేయడమే కాకుండా, మే 9న ఘనంగా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక బాలయ్య మార్క్ మాస్‌కు, కొరటాల మార్క్ సోషల్ మెసేజ్‌ను జోడించి ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇక కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, సినిమాలో విలన్ లేదా కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పేరు కూడా వినిపిస్తుంది. ఒకవేళ సంజయ్ ఈ ప్రాజెక్ట్‌లో చేరితే, బాలయ్యతో ఆయన తలపడే సీన్లు బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, ఆగస్టు నుండి ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుందని సమాచారం.

Advertisement

ALSO READ:అది నా “హ్యాపీ ప్లేస్”.. త్రిష పోస్ట్ వైరల్!

బాలయ్య వరుస సినిమాల జోరు:

గత ఏడాది డాకు మహారాజ్, అఖండ 2: తాండవం వంటి సినిమాలతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన బాలయ్య, ఇప్పుడు తన 112వ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక పక్క గోపీచంద్ మలినేని సినిమా పనుల్లో ఉంటూనే, కొరటాల శివ ప్రాజెక్ట్ కోసం డేట్స్ కేటాయించారు. ఇక ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనేది చిత్ర యూనిట్ ప్లాన్.

బాలయ్య – కొరటాల కాంబో అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. దానికి విద్యాబాలన్, సంజయ్ దత్ వంటి తారలు తోడైతే ఇక ఆ సందడి వేరే లెవల్లో ఉంటుంది. ఇక కొరటాల శివ ఈ సినిమాతో బాలయ్యకు ఎలాంటి పవర్‌ఫుల్ హిట్ ఇస్తారో చూడాలని నందమూరి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు..

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×