E-Paper
Advertisement

కొత్త ఫోన్ కావాలా? ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైనవి ఇవే.. లిస్ట్ చూస్తే షాకే!

కొత్త ఫోన్ కావాలా? ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైనవి ఇవే.. లిస్ట్ చూస్తే షాకే!

Best Selling Smartphones 2026: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. యాపిల్, శాంసంగ్, షావోమి, తదితర కంపెనీలు.. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తూ మెుబైల్ ప్రియులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే సేల్స్ విషయంలో మెుబైల్ కంపెనీల మధ్య గట్టి పోటీ సైతం నడుస్తోంది. ఈ నేపథ్యంలో 2026 తొలి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడిపోయిన టాప్-10 జాబితాను మార్కెట్ పరిశోధనా సంస్థ ‘కౌంటర్ పాయింట్ రీసెర్చ్’ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. ఆ జాబితాలోని ఫోన్లు ఏవి? ఏ కంపెనీ అత్యధిక ఫోన్లతో సత్తా చాటింది? ఇప్పుడు చూద్దాం.

టాప్ 3లో ఐఫోన్ల జోరు

2026 తొలి త్రైమాసికంలో యాపిల్ కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 17 సిరీస్ మెుబైల్స్ దుమ్మురేపినట్లు ‘కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేల్ అయిన మెుబైల్స్ జాబితాలో టాప్ – 3 అవే నిలిచినట్లు పేర్కొంది. ప్రపంచ మార్కెట్ లో 6 శాతం వాటాతో iPhone 17 అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపింది. iPhone 17 Pro Max, 17 Pro.. 2, 3 స్థానాలను కైవసం చేసికున్నట్లు నివేదిల వెల్లడించింది. బేస్ మోడల్ అయిన iPhone 17లో మెరుగైన స్టోరేజ్, హై-రిజల్యూషన్ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉండటమే టాప్ లో ఉండటానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఆ తర్వాతి స్థానాల్లో..

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ల తర్వాత నాలుగో స్థానంలో శాంసంగ్ గెలాక్సీ ఎ07 4G (Galaxy A07 4G) నిలిచింది. ఐదో స్థానంలో గెలాక్సీ ఎ17 5G (Galaxy A17 5G), ఆరో స్థానంలో యాపిల్ పాత మోడల్ అయిన ఐఫోన్ 16 (iPhone 16) చోటు సంపాదించింది. ఆ తర్వాతి స్థానాల్లో శాంసంగ్ కు చెందిన గెలాక్సీ ఎ56 (7వ స్థానం), Galaxy A36 (8వ స్థానం), Galaxy A17 4G (9వ స్థానం) నిలిచాయి. చివరగా పదో స్థానంలో చైనీస్ బ్రాండ్ షావోమీకి చెందిన రెడ్ మీ ఎ5 (Redmi A5) నిలిచింది. ఈ టాప్ 10 ఫోన్లు మొత్తం మార్కెట్ అమ్మకాల్లో 25% వాటాను కలిగి ఉన్నట్లు లేటెస్ట్ రిపోర్ట్ తెలిపింది.

Also Read: Gen Zని ఫిదా చేస్తున్న.. టాప్ – 5 వైర్డ్ ఇయర్ ఫోన్స్.. మ్యూజిక్ లవర్స్‌కు పండుగే!

శాంసంగ్ ఆధిపత్యం

ఆండ్రాయిడ్ విభాగంలో శాంసంగ్ తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లు లేటెస్ట్ నివేదికను బట్టి తెలుస్తోంది. తన గెలాక్సీ ఏ సిరీస్ మోడళ్లతో టాప్ -10లోని 5 స్థానాలను శాంసంగ్ సొంతం చేసుకుంది. అయితే ఆశ్చర్యకరంగా శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ గెలాక్సీ ఎస్ 26 (Galaxy S26 Ultra) టాప్ 10లో చోటు సంపాదించకపోవడం గమనార్హం. మరోవైపు శాంసంగ్ తర్వాత టాప్-10లో నిలిచిన ఏకైక చైనీస్ బ్రాండ్ గా షావోమీ నిలిచింది. తక్కువ బడ్జెట్ లో లభిస్తున్న Redmi A5 మెుబైల్ ను.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేసినట్లు నివేదికను బట్టి అర్ధమవుతోంది.

Also Read: మార్కెట్లోకి వచ్చేసిన OnePlus Pad 4.. రూ. 5,000 డిస్కౌంట్.. ధర, ఫీచర్ల వివరాలివే!

Related News

యాడ్స్, బ్లోట్‌వేర్ లేని బెస్ట్ 5G ఫోన్.. రూ.12 వేల లోపే లాంచ్ చేసిన లావా!

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

Big Stories

×