Vidya Balan:ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్స్ ఎప్పటికప్పుడు బహిరంగంగా తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ఆమె ఎవరో కాదు విద్యాబాలన్ (Vidya Balan). ది డర్టీ పిక్చర్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. తాజాగా జైలర్ 2 సినిమాలో కాంత అనే కీలకపాత్ర పోషించి ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో అటు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న విద్యాబాలన్ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ నుండి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది.
విద్యాబాలన్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక డైరెక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. అయితే నేను సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ ప్రమాదం నుండి బయటపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది విద్యాబాలన్. ఒకరోజు చెన్నైలో ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ నన్ను కలవడానికి వచ్చాడు. కాఫీ షాప్ లో కూర్చుని మాట్లాడుకుందాం అని నేను చెప్పాను. కానీ ఆయన వినలేదు. ప్రత్యేకంగా మాట్లాడాలని, హోటల్ రూమ్ కి వెళ్దామని పట్టుబట్టాడు.
also read:ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్న అనుపమ.. అంతలా వేధించారా?
అయితే నేను సింగిల్ గా ఉండడంతో అతని ఉద్దేశం వెంటనే అర్థం కాలేదు. కానీ పరిస్థితిని గమనించిన నేను.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాను. హోటల్ గదిలోకి వెళ్లిన వెంటనే ఏమాత్రం తడబడకుండా.. గది తలుపులు మూయకుండా తెరిచే ఉంచాను. ఇక ఆ డైరెక్టర్ కి ఏం చేయాలో తెలియక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ క్షణం నేను సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ సంఘటన నుండి బయటపడగలిగాను. ఇక ఆ తర్వాత ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు పెద్దగా ఏమీ ఎదురుకాలేదు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇకపోతే ఆ సంఘటన తర్వాత తనను ఆ సినిమా నుంచి తొలగించారని కూడా విద్యాబాలన్ తెలిపారు. మొత్తానికైతే ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఆ సినిమా ఏంటి? అనే విషయాలపై విద్యాబాలన్ స్పందించలేదు
విద్యాబాలన్ విషయానికి వస్తే పదహారేళ్ల వయస్సులో ఏక్తాకపూర్ నిర్మించిన హమ్ పాంచ్ అనే హిందీ సీరియల్ లో నటించింది. హీరోయిన్ అవ్వాలనుకుంటున్నట్లు ఇంట్లో చెబితే ముందు చదువు పూర్తి చేయమన్నారట అలా సోషియాలజీలో ముంబై యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ అందుకుంది. ఆ తర్వాత సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. మొదట మలయాళం లో మోహన్ లాల్ సరసన చక్రం సినిమాకు సైన్ చేసింది. కానీ నిర్మాణంలో జాప్యం ఏర్పడడంతో అది ఆగిపోయింది. దాంతో మలయాళం ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అని పేరు పెట్టారు. అలా రెండు మూడు భాషా చిత్రాలలో ఈమెను హీరోయిన్గా అనుకోవడం , ఆ తర్వాత వేరే హీరోయిన్లతో రీప్లేస్ చేయడంతో ఇక ఈమె సౌత్ ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. ఇక అక్కడే వరుస అవకాశాలు తలుపు తట్టగా భారీ పాపులారిటీ అందుకుంది .. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీపై దృష్టి పెడుతూ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది విద్యాబాలన్.