E-Paper
Advertisement

ముఖ్యమంత్రిగా విజయ్.. తొలి సంతకం దానిపైనే!

ముఖ్యమంత్రిగా విజయ్.. తొలి సంతకం దానిపైనే!
Advertisement

CM Joseph Vijay:ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ నటుడు జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అభిమానులు, సెలబ్రిటీలు, అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు . చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ చారిత్రక వేడుకలో విజయ్ తో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పదవీ స్వీకారం ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యి విజయ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా స్టేడియం లోపల, వెలుపల కూడా లక్షలాదిమంది అభిమానులు, ప్రజలు తమ అభిమాన నటుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతుంటే ఆనందంలో కేరింతలు కొడుతూ.. చెన్నై నగరం మొత్తం దళపతి అనే నినాదాలతో మారుమ్రోగేలా సందడి చేశారు.

తొలి సంతకం దానిపైనే..

ఇకపోతే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం దేనిపై చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూడగా.. అందరూ మెచ్చేలా.. ఎన్నికల ప్రచారాలలో ఇచ్చిన హామీ మేరకే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన ఫైల్ పై ఆయన తొలి సంతకం చేశారు. ముఖ్యంగా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటును ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా పాలనలో తన ప్రాధాన్యత సామాన్యుల సంక్షేమమేనని ఈ తొలి సంతకంతో విజయ్ అధికారికంగా స్పష్టం చేశారు . ఇక అలాగే మహిళ భద్రతపై, డ్రగ్స్ కి వ్యతిరేకంగా లీగల్ తరహా వ్యవస్థలపై కూడా ఆయన సంతకం చేశారు.

మరో ఎన్టీఆర్ , ఎంజీఆర్ గా గుర్తింపు..

Advertisement

ఇకపోతే విజయ్ మరో ఎన్టీఆర్, ఎంజీఆర్ గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పడంలో సందేహం లేదు. పార్టీ స్థాపించిన 14 నెలల్లోనే తన మేనిఫెస్టోతో ప్రజల మనసు గెలుచుకున్న విజయ్ తొలిసారి పోటీ చేసిన ఎన్నికలలోనే ప్రభంజనం సృష్టించి.. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని కాదని.. తమిళ ప్రజలు తనకు పట్టం కట్టేలా చేసుకున్నారు .ఇక ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అందరి హృదయాలను సంబరపరిచారు విజయ్ దళపతి. ఇక ప్రస్తుతం 60 సంవత్సరాలుగా తమిళనాడులో ఆధిపత్యాన్ని చలాయిస్తున్న ద్రవిడ పార్టీలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి అనడంలో సందేహం లేదు. ఇకపోతే 234 స్థానాలలో పోటీ చేయగా ఏకంగా 108 స్థానాలలో విజయం సాధించి సంచలనం సృష్టించారు. అంతేకాదు విజయ్ పోటీ చేసిన రెండు స్థానాలలో కూడా గెలవడం గమనార్హం.

also read:Kissik Talks: మరకతమణి సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సంజన!

సక్సెస్ లో భాగమైన త్రిష..

Advertisement

ఇదిలా ఉండగా విజయ్ సక్సెస్ లో త్రిష భాగం అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి . నిజానికి విజయ్ తో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన ఈమె.. సక్సెస్ లతో మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక విజయ్ రాజకీయంగా అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆయన వెనుక ఉండి ముందుకు నడిపిస్తూ మరింత వైరల్ అయింది త్రిష. దీనికి తోడు ఎన్నికల ఫలితాల సమయంలో విజయ్ ను కలిసిన ఈమె.. ఇప్పుడు విజయ్ ప్రమాణస్వీకారం చేస్తుంటే అక్కడికి వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Related News

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య భామ..టార్గెట్ సెకండ్ ఇన్నింగ్స్ ?

Big Stories

Advertisement
×