E-Paper
Advertisement

Vijay Devarakonda: రష్మికతో పెళ్లి.. ఆ టైమ్‌లో నా చేతులు షేక్ అయ్యాయంటూ విజయ్ స్టేట్మెంట్

Vijay Devarakonda: రష్మికతో పెళ్లి.. ఆ టైమ్‌లో నా చేతులు షేక్ అయ్యాయంటూ విజయ్ స్టేట్మెంట్

Vijay Devarakonda:  రష్మిక మందన్న విజయ్ దేవరకొండ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం ఫిబ్రవరి 26వ తేదీ తెలుగు, కొడవ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ జంట తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఒకరి గురించి ఒకరు ఎమోషనల్ పోస్టులు షేర్ చేశారు. నా భర్తను పరిచయం చేస్తున్నానంటూ రష్మిక పోస్ట్ చేయగా నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్యగా మారింది అంటూ విజయ్ కూడా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

పెళ్లి బంధంతో ఒక్కటైన విరోష్..

ఇలా రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి జరగడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక పెళ్లయిన వెంటనే కొత్తజంట పలువురు రాజకీయ ప్రముఖులను కలుస్తూ వారి వివాహ రిసెప్షన్ కు ఆహ్వానం అందజేస్తున్నారు. ఇదిలా ఉండగా రష్మికతో పెళ్లి గురించి విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ మొదటిసారి గీతా గోవిందం(Geetha Govindam) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రష్మిక మెడలో మూడు ముళ్ళు వేస్తారు. అయితే ఆ సమయంలో జరిగిన సంఘటన గురించి ఈయన గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తాళి కట్టడానికి చేతులు వణికిపోయాయి..

గీత గోవిందం సినిమా షూటింగ్ సమయంలో రష్మిక మెడలో మూడు ముళ్ళు వేయటానికి తన చేతులు బాగా వణికిపోయాయని బాడీ మొత్తం షేక్ అయిపోయిందని తెలిపారు. రష్మిక పెళ్లి చీర కట్టుకొని అచ్చం పెళ్లికూతురు లాగే ఉంది  తాను కూడా పట్టుపంచలో ఉన్నాను. చుట్టూ అందంగా డెకరేషన్ చేసిన పెళ్లి మండపం ఇదంతా చూసేసరికి నాలో ఏదో తెలియని భయం మొదలైందని, అది షూటింగ్ అని తెలిసిన చాలా అలజడిగా ఉందని తెలిపారు.

రష్మికకు మూడుసార్లు పెళ్లి..

ఇదే విషయం గురించి రష్మికతో మాట్లాడుతూ ఏదో వింతగా ఉందని నేను టెన్షన్ పడుతుంటే ఆమె మాత్రం చాలా కూల్ గా ఉందని తెలిపారు. అప్పటికే రష్మిక మూడు సినిమాలలో ఇలాంటి పెళ్లి సీన్లు చేయడంతో తను మాత్రం ప్రశాంతంగా ఉందని గతంలో విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇలా సినిమాలలో ఏడేళ్ల క్రితమే రష్మిక మెడలో మూడు ముళ్ళు వేసిన విజయ్ నిజ జీవితంలో కూడా ఆమె మెడలో మూడు ముళ్ళు వేయటం విశేషం.. ఇలా తన బెస్ట్ ఫ్రెండ్ ని భార్యగా పొందటం చాలా సంతోషంగా ఉంది అంటూ విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Allu Sirish Nainika wedding: అల్లు స్టూడియోస్ లో అల్లు శిరీష్ నైనిక రిసెప్షన్..ఎప్పుడంటే?

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×