తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత నేరం చేసింది అనడానికి సరైన ఆధారాలు లేనందున రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో కవిత నేరం చేయలేదు అని ఈ తీర్పు స్పష్టంచేసినట్టు అయ్యింది. కాగా, 2023 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమె అక్రమాలు, అవకతవకలకు పాల్పడిందని పేర్కొంటూ సీబీఐ కేసులు పెట్టింది. ఆ తర్వాత విచారణ పేరుతో కస్టడీకి తీసుకుంది. సుమారు 166 రోజుల పాటు ఆమె తిహార్ జైలులో ఉన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్.. బీజేపీతో పొత్తుకు సిద్ధమైందని, ఈ ప్రస్తావన తన ముందుకు రాగా, వ్యతిరేకించినట్టు కవిత గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ పరువు ప్రతిష్టలను దిగజార్చేందుకు కేంద్రంలోని బీజేపీ పార్టీ.. సీబీఐ ద్వారా రీవెంజ్ తీసుకుందని కల్వకుంట్ల కవిత పలుమార్లు ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని, ఇది తప్పుడు కేసులు పెట్టారని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సీబీఐ కావాలని ఈ కేసులో ఆమెను ఇరికించినట్టు మండిపడింది. సరైన ఆధారాలు లేకుండా కేసులు ఎలా పెడతారని, అభియోగం ఎలా మోపుతారని న్యాయస్థానం ఫైర్ అయ్యింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సహా మరో 20 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
2021-22 ఏడాదిలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తేగా ఇందులో అక్రమాలు జరిగాయని, 2022 జూలైలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించారు. మరోవైపు లైసెన్స్ ఫీజు మాఫీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందని, మద్యం వ్యాపారులకు మేలు చేసేలా పాలసీని రూపొందించారని అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ నివేదిక కూడా ఇచ్చారు.ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు నుంచి కవిత హస్తం ఉందని, ఆప్ పార్టీకి ముడుపులు అందడంలో ఆమె ఇన్వాల్వ్ మెంట్ ఉందని సీబీఐ అభియోగాలు మోపింది. కాగా, ఇదంతా కేంద్రంలోని బీజేపీ కావాలనే తనపై తప్పుడు కేసులు బనాయించిందని ఆమె ఆరోపించారు.నాటి నుంచి ఆమె బీజేపీని టార్గెట్ చేశారు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు.. న్యాయస్థానం క్లీన్ చిట్, కవిత ఫస్ట్ రియాక్షన్
తాజాగా ఈ కేసులో కవితకు ఊరట లభించగా ఆమె రాజకీయంగా బీజేపీని శత్రువుగా చూస్తుందా? లేదా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ఓ కారణమని ప్రచారం జరిగింది. ఎన్నికల ముందు కవిత లిక్కర్ స్కామ్‌కు పాల్పడిందని, బీఆర్ఎస్ అవినీతికి అదో పరాకాష్ట అని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెద్దఎత్తున ప్రచారం చేశాయి. లిక్కర్ స్కాములో చెల్లె అంతగా అవినీతికి పాల్పడితే.. తండ్రీకొడుకులు అంతకుమించి అవినీతికి పాల్పడారని పార్టీలు ఆరోపించాయి. ఈ క్రమంలోనే కేసీఆర్.. బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తామని ప్రకటించినప్పుడు కవిత వ్యతిరేకించినట్టు పేర్కొంది. ఆ కారణంగానే కల్వకుంట్ల కుటుంబలో మనస్పర్దలు రావడం, కవిత పార్టీ నుంచి బయటకు రావడం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజకీయ జీవితం కోసం భవిష్యత్‌లో కవిత.. బీజేపీతో దోస్తీ చేస్తుందా? శత్రుత్వం కొనసాగిస్తుందా? తెలియాల్సి ఉన్నది.