E-Paper
Advertisement

Allu Sirish: అల్లు శిరీష్ పెళ్లి సందడిలో కొత్తజంట విజయ్ దేవరకొండ – రష్మిక..!

Allu Sirish: అల్లు శిరీష్ పెళ్లి సందడిలో కొత్తజంట విజయ్ దేవరకొండ – రష్మిక..!
Advertisement

Allu Sirish: అల్లు కుటుంబంలో పెళ్లి శుభకార్యాలు జోరుగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ పెళ్లి పనులు అధికారికంగా మొదలయ్యాయి. ఈ క్రమంలో జరిగిన పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం చాలా సందడిగా సాగింది. ఈ ఫంక్షన్‌కు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కొత్తగా పెళ్లి చేసుకున్న జంట విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న. వీరిద్దరూ కలిసి అల్లు శిరీష్ పెళ్లి కొడుకును చేసే.. కార్యక్రమానికి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఈ ఫోటోలు నెట్టింట వేగంగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఆకట్టుకున్న కొత్తజంట..!

వేడుకలో అల్లు శిరీష్ సంప్రదాయ పెళ్లి కొడుకు గెటప్‌లో కనిపించారు. ఆయనతో పాటు అల్లు అర్జున్.. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే విజయ్ దేవరకొండ, రష్మికతో పాటు ఆనంద్ దేవరకొండ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. అందరూ కలిసి చాలా ఆనందంగా ఫోటోలు దిగారు.

Advertisement

ఈ రోజు ఉదయం విజయ్ దేవరకొండ – రష్మిక హైదరాబాద్‌లోని టీటీడీ గుడిని దర్శించినట్టు సమాచారం. అక్కడ ప్రత్యేక పూజలు చేసి దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. అంతేకాదు, వీరి పెళ్లి వేడుకల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా రష్మిక కలిసి మార్చి 4న జరిగే రిసెప్షన్‌కు ఆహ్వానించారు.

ఈరోజు మొత్తం తెగ సందడి..!

ఈ రోజు మొత్తం ఈ జంటకు చాలా బిజీగా గడిచింది. ఒక ఫోటోలో అల్లు అరవింద్, రష్మికను ఎంతో ఆప్యాయంగా హగ్ చేసుకుని కనిపించడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.

అల్లు శిరీష్ పెళ్లి పనుల్లో భాగంగా జరిగిన ఈ వేడుక, కొత్త జంట హాజరుతో మరింత ప్రత్యేకంగా మారింది. సినీ అభిమానులకు ఇది నిజంగా ఒక మధురమైన విజువల్ ట్రీట్‌గా నిలిచింది.

ALSO READ: Vijay Trisha: విజయ్ పార్టీకి త్రిష పేరు.. విడాకుల వార్తల వేళ ఇదేమి షాకింగ్ ట్విస్ట్ రా బాబు..!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×