E-Paper
Advertisement

Vijay Trisha: విజయ్ పార్టీకి త్రిష పేరు.. విడాకుల వార్తల వేళ ఇదేమి షాకింగ్ ట్విస్ట్ రా బాబు..!

Vijay Trisha: విజయ్ పార్టీకి త్రిష పేరు.. విడాకుల వార్తల వేళ ఇదేమి షాకింగ్ ట్విస్ట్ రా బాబు..!
Advertisement

Vijay Trisha: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇప్పుడు సినిమాలకే కాదు..రాజకీయాలకు కూడా పూర్తిగా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తన రాజకీయ పార్టీని ప్రకటించి, పబ్లిక్ లైఫ్‌లో కొత్త దశను ప్రారంభించారు. సినిమాల నుంచి క్రమంగా దూరమవుతూ..పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌కు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారుతోంది.

అదే కారణం..!

ఇప్పటికే విజయ్, హీరోయిన్ త్రిష కృష్ణన్ మధ్య ప్రేమ ఉందని ఎన్నో ఏళ్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే ఈ విషయంపై విజయ్ కానీ, త్రిష కానీ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. అయినా నెటిజన్లు మాత్రం ఈ టాపిక్‌ను వదలడం లేదు. మరోపక్క విజయ్.. భార్య.. అతనికి వేరే అమ్మాయితో ఉన్న సంబంధం వల్లే.. విడాకులు కోరింది అన్న వార్త.. త్రిష, విజయ్ ప్రేమ వార్తకు మరింత బలం చేకూర్చింది.

పార్టీ పేరులో త్రిష..!

Advertisement

ఇలాంటి సమయంలో విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ పేరు కూడా సోషల్ మీడియాలో కొత్త చర్చకు కారణమైంది. ఆయన పార్టీ పేరు TVK (తమిళగ వెట్రి కజగం). దీన్ని చూసిన నెటిజన్లు కొత్త థియరీ ఒకటి తీసుకొచ్చారు. త్రిష పూర్తి పేరు త్రిష కృష్ణన్. విజయ్ పేరు మధ్యలో పెట్టి చూస్తే “Trisha – Vijay – Krishnan” అన్న మూడు పేర్ల మొదటి అక్షరాలే TVK అవుతాయని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అందుకే విజయ్ తన పార్టీకి ఈ పేరు పెట్టాడా? అంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

కొంతమంది దీనిని జస్ట్ ఫన్‌గా తీసుకుంటే, మరికొందరు మాత్రం ఇది చాలా ఓవర్ థింకింగ్ అంటూ విమర్శిస్తున్నారు. అసలు ఈ పార్టీ పేరుకు త్రిషకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేవాళ్లూ ఉన్నారు.

Advertisement

ఇక సినిమాల విషయానికి వస్తే, విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటున్న ‘జననాయకన్’ ఇంకా విడుదల కావాల్సి ఉంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్, ఈ సినిమాతో అభిమానులకు ఎలాంటి ఫేర్‌వెల్ ఇస్తాడో చూడాలి. మొత్తానికి, TVK పార్టీ పేరు చుట్టూ తిరుగుతున్న ఈ థియరీ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ALSO READ: Ustad Bhagat Singh new poster: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ విడుదల.. యమ యంగ్ గా కనిపించిన పవర్ స్టార్..!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×