E-Paper
Advertisement

Vijay Rashmika: రష్మిక, విజయ్ పెళ్లి సంబరాలు మొదలు.. ఫ్యామిలీతో సహా ఉదయపూర్ చేరుకున్న జంట

Vijay Rashmika: రష్మిక, విజయ్ పెళ్లి సంబరాలు మొదలు.. ఫ్యామిలీతో సహా ఉదయపూర్ చేరుకున్న జంట
Advertisement

Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా వీరి ప్రేమపై అనేక ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఈ జంట పెళ్లి వేడుకలు ప్రారంభమవుతుండటంతో అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. సోషల్ మీడియాలో “విరోష్” జంటకు శుభాకాంక్షల సందేశాలు వెల్లువలా వస్తున్నాయి.

పెళ్లికి వాళ్ళు మాత్రమే ఆహ్వానితులు..!

రష్మిక, విజయ్ ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచేవారు. సినిమా ప్రయాణంలో పరిచయం ప్రేమగా మారిందని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల వీరి సన్నిహిత వర్గాల ద్వారా పెళ్లి విషయం బయటకు రావడంతో ఉత్సాహం పెరిగింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని అందమైన నగరం ఉదయ్‌పూర్‌లో వివాహం జరగనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలకు హాజరుకానున్నారు.

Advertisement

పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే రష్మిక తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉదయ్‌పూర్‌కు చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ వద్ద ఆమె చిరునవ్వుతో మీడియాకు నమస్కారం చేసింది. చాలా సింపుల్ డ్రెస్‌లో కనిపించిన రష్మిక చాలా ప్రశాంతంగా, సంతోషంగా కనిపించింది. అభిమానులు ఆమె సింపుల్ లుక్‌ను బాగా మెచ్చుకుంటున్నారు.

విజయ్ దేవరకొండ కూడా తన తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. సాదాసీదా దుస్తులు, కూలింగ్ గ్లాసెస్‌తో ఆయన కనిపించారు. మీడియాకు అభివాదం చేసి నేరుగా హోటల్‌కు వెళ్లారు. కుటుంబ సభ్యులందరూ కలిసి కనిపించడం ఫ్యాన్స్‌కు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చింది.

Advertisement

ఈ పెళ్లి వేడుకలు పూర్తిగా ప్రైవేట్‌గా జరుగుతున్నప్పటికీ, చిన్న చిన్న అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు తమ ఇష్టమైన జంట కొత్త జీవితానికి అడుగుపెడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఉదయ్‌పూర్‌లో జరగనున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: Yash Toxic: యష్ ‘టాక్సిక్’ నుంచి మరో యాక్టర్ లుక్ విడుదల.. ఎవరో తెలుసా?

Related News

టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు.. ఏకంగా ముగ్గురు అరెస్ట్!

విజయ్, ర‌ష్మిక మైల్ స్టోన్ మూవీగా ‘రణబాలి’.. బ్లాక్ బస్టర్ టాక్ తో దూకుడు..

రామ్ పోతినేని సినిమాలో జెనిలియా భర్త.. వీడియో వైరల్!

డైరెక్టర్ పై సోనాలి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.. నిర్మానుష్య ప్రాంతంలో?

కావ్యతో అనిరుద్ పెళ్ళి…కట్నం ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

చిరంజీవి కాకా మూవీ నుండి సీన్ లీక్.. ఊరమాస్ గెటప్ లో అదుర్స్!

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

Big Stories

Advertisement
×