E-Paper
Advertisement

విజయ్‌కు పవన్ కళ్యాణ్ సలహా.. చెప్పినట్లే చేశాడుగా!

విజయ్‌కు పవన్ కళ్యాణ్ సలహా.. చెప్పినట్లే చేశాడుగా!
Advertisement

Pawan Kalyan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతూ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగుతూ రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay)రాజకీయాలలోకి రావడం గురించి ప్రశ్నలు ఎదురవడంతో పవన్ కళ్యాణ్ విజయ్ పాలిటిక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు గతంలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు జరిగి ఎన్నికల ఫలితాలలో భాగంగా విజయ్ టీవీకే పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గతంలో విజయ్ పాలిటిక్స్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విజయ్ కు పవన్ సలహా..

ఈ వీడియోలో భాగంగా పవన్ కళ్యాణ్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీరు విజయ్ ఇద్దరు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ రాజకీయాలలోకి వచ్చారు. ఇక మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు అయితే రాజకీయాలలోకి వచ్చిన విజయ్ గారికి ఏదైనా సలహా ఇస్తారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతూ.. రాజకీయాలలోకి వచ్చే హక్కు ఎవరికైనా ఉందని తెలిపారు.

ఫలితం ఆశించకూడదు..

Advertisement

హీరో విజయ్ గొప్ప నటుడు ఆయన రాజకీయాలలోకి రావడానికి కారణాలు ఉన్నాయి అయితే ఎవరైనా రాజకీయాలలోకి రావచ్చు కానీ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఫలితం ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. నేను రాజకీయాలలోకి వచ్చిన సమయంలో ఎలాంటి పదవులు ఆశించలేదు, రాజకీయాలలోకి వచ్చినప్పుడు నా మీద నాకే హోప్ లేదు కానీ ఒక లక్ష్యం కోసం పని చేసుకుంటూ వెళ్లినప్పుడు సక్సెస్ దానంతట అదే వస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి రావడానికి కాస్త సమయం పట్టినప్పటికీ ఎంతో ఓపికగా ఆయన తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎదురు చూస్తూ చివరికి విజయం అందుకున్నారు. ఇలా సక్సెస్ కావడంతోనే విజయ్ కు సలహా ఇచ్చారని తెలుస్తోంది.

రాష్ట్ర ప్రజలకు భరోసా..

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చిన మేరకు హీరో విజయ్ కూడా ఎలాంటి ఫలితం ఆశించకుండా రాజకీయాలలోకి వచ్చి తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా కల్పించారు. ఈయన వస్తే సాధ్యమవుతుందన్న నమ్మకం తమిళనాడు రాష్ట్ర ప్రజలలో కలిగింది. ఈ నేపథ్యంలోనే విజయ్ పార్టీ పెట్టిన రెండు సంవత్సరాలకి ఎన్నికల బరిలో దిగారు. ఇక ప్రజలు కూడా ఈయనకు పట్టాభిషేకం చేశారు. నేడు విడుదలైన ఎన్నికల ఫలితాలలో భాగంగా విజయ్ భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకున్నారు.

Also Read: విజయ్ విజయం.. విజిలేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న హీరో జీవా!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×