E-Paper
Advertisement

హీరో To KTM.. రూ. 2 లక్షల లోపు టాప్ 5 పవర్‌ ఫుల్ బైక్స్ ఇవే!

హీరో To KTM.. రూ. 2 లక్షల లోపు టాప్ 5 పవర్‌ ఫుల్ బైక్స్ ఇవే!
Advertisement

Powerful Bikes Under Rs.2 Lakh: భారత్ లో బైక్ మార్కెట్ రోజురోజుకీ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా యువతలో స్పోర్టీ, పవర్‌ ఫుల్ బైక్‌ ల పట్ల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు హై పర్ఫార్మెన్స్ గల బైక్‌ లు కొనాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. రూ. 2 లక్షల లోపే పవర్, స్టైలిష్ డిజైన్, సౌకర్యవంతమైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను ఇచ్చే బైక్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కొత్తగా బైక్ నేర్చుకునేవారికి కూడా ఇవి సరిగ్గా సూటవుతాయి. రూ. 2 లక్షల్లో లభించే కొన్ని బెస్ట్ పవర్‌ ఫుల్ బైక్‌ ల గురించి ఇప్పుడు చూద్దాం..

⦿ Bajaj Pulsar NS400Z

రీసెంట్ గా మార్కెట్ లోకి విడుదలైన మోడల్ అయినప్పటికీ ఇప్పటికే మంచి ఆదరణ దక్కించుకుంది. ఇందులో 349cc ఇంజన్ ఉంటుంది. సుమారు 40.6 హెచ్‌పి పవర్, 33.3 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ధరలో ఇంత పవర్ ఇచ్చే బైక్ చాలా అరుదు. సుమారు రూ. 1.80 లక్షల ధరతో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. డిజైన్ కూడా స్పోర్టీగా ఉండటంతో యువతకు బాగా నచ్చుతోంది.

⦿ Hero Xtreme 250R

Advertisement

ఈ బైక్ కూడా స్టైలిష్ లుక్‌ తో పాటు మంచి పని తీరును కలిగి ఉంటుంది. ఇందులో 249cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 30 హెచ్‌పి పవర్, 25 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ధర కూడా సుమారు రూ. 1.69 లక్షలు ఉంటుంది. చిన్న ఇంజన్ అయినా మంచి పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ Triumph Speed T4

ట్రయంఫ్ బ్రాండ్ అంటేనే ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది. ఈ బైక్‌లో 349cc ఇంజన్ ఉంది. ఇది 29 హెచ్‌పి పవర్, 31 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. సుమారు రూ. 1.95 లక్షల ధరతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. కంఫర్ట్, స్టైల్ రెండూ కావాలనుకునే వారికి ఇది  సూటవుతుంది.

⦿ Suzuki Gixxer 250

Advertisement

ఈ బైక్ కూడా మంచి పనితీరు, స్మూత్ రైడింగ్ తో బాగా పాపులర్ అయ్యింది. ఇందులో 249cc ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. 26.5 హెచ్‌పి పవర్, 22.2 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ధర సుమారు రూ. 1.81 లక్షల వరకు ఉంటుంది.

⦿ KTM 200 Duke

KTM అంటేనే స్పీడ్, అగ్రెసివ్ స్టైల్ కేరాఫ్ గా ఉంటుంది. ఈ బైక్‌ లో 199.5cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. 25 హెచ్‌పి పవర్, 19.3 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. సుమారు రూ. 1.98 లక్షల ధరతో ఇది అందుబాటులో ఉంది. లైట్ వెయిట్, కంట్రోల్ సులభంగా ఉండటం వల్ల యువ రైడర్లకు బాగా నచ్చుతుంది.

Read Also: మళ్లీ రోడ్లపైకి పాత చేతక్.. జస్ట్ రూ. 70 వేలకే రెట్రో ఎలక్ట్రిక్ స్కూటర్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×