vijay sethupathi: విజయ్ సేతుపతి కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే తమిళంలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ హోస్ట్ గా ఉండేవారు కానీ కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో విజయసేతుపతి తమిళ బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగుతున్నారు.జియో హాట్ స్టార్ వాళ్లు చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా అన్ని భాషలలో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న వారందరూ కూడా ఈ వేదికపై పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ సేతుపతి నటుడు నాగార్జున పై ప్రశంసల కురిపించారు. చిన్నప్పుడు తాను నాగార్జున సర్ ను ఎలాగైతే చూశానో ఇప్పటికీ అలాగే ఉన్నారని ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిపారు. అసలు ఎందుకు నాగార్జున గారి వయసు పెరగటం లేదో అర్థం కావడం లేదు. ఈ విషయంపై యాంటీ ఏజింగ్ పరిశోధనలు చేయాల్సిందే అంటూ విజయ్ సేతుపతి నాగార్జున వయసు పై చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నా చిన్నప్పటి నుంచి మాత్రమే కాదు రేపు నాకు మనవళ్లు పుట్టి వాళ్ళు కూడా పెద్దయిన తరువాత కూడా నాగార్జున గారు ఇలాగే ఉంటారేమో అంటూ విజయసేతుపతి మాట్లాడారు. ఇలా వేదికపై నాగార్జున ఫిట్నెస్ గురించి ఆయన అందం గురించి విజయ్ సేతుపతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నాగార్జున ప్రస్తుతం 67 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఈ వయసులో కూడా ఈయన యువ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా అదే అందం అదే ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నారు.. ఇప్పటికీ నాగార్జున మన్మధుడిగానే ఎంతోమంది అమ్మాయిలకు అభిమాన హీరోగా ఉన్నారని చెప్పాలి.
బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున..
ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఈయన కుబేర సినిమాతో పాటు రజనీకాంత్ కూలి సినిమాలో కూడా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈయన చివరిగా నా సామిరంగా అనే సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత తన తదుపరి సినిమాని ప్రకటించలేదు అయితే త్వరలో నాగార్జున చేయబోయే సినిమా తన సినీ కెరియర్ లోనే 100 వ సినిమా కావటం విశేషం. ఇక ఈ సినిమా విషయంలో నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక నాగార్జున సినిమాలతో పాటు మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Renuka Swamy: రేణుక స్వామి సమాధి ద్వంసం.. చిక్కుల్లో పడిన దర్శన్?