E-Paper
Advertisement

JETLEE : రియా ఇక్కడే, కమెడియన్ సత్యకు హీరోయిన్ సెట్, కానీ ఆ కండిషన్స్

JETLEE : రియా ఇక్కడే, కమెడియన్ సత్యకు హీరోయిన్ సెట్, కానీ ఆ కండిషన్స్
Advertisement

JETLEE : ఈ రోజుల్లో చాలా జోనర్స్ లో సినిమా రావడం అనేది కామన్ గా జరుగుతూ ఉంది. అయితే కొన్ని విషయాల్లో చాలా మార్పులు సంభవించినట్లు కామెడీ సినిమాల్లో కూడా కొన్ని మార్పులు వచ్చేసాయి. ముఖ్యంగా కామెడీ సాధారణంగా ఉంటే ఈ రోజుల్లో ఎవరు అంతగా ఇష్టపడటం లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెడీ రాయడంలో కూడా నేటి దర్శకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెడీ రాసి సక్సెస్ అయిన దర్శకుడు రితీష్ రానా. మత్తు వదలరా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రితీష్. ఇటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ సినిమా ఆ స్థాయిలో ఆశ్చర్యపరిచింది కాబట్టి తన రెండవ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ లావణ్య త్రిపాఠి నటించిన ఆ హ్యాపీ బర్త్డే డిజాస్టర్.

సత్య కోసం మిస్ యూనివర్స్ ఇండియా 

Advertisement

కమెడియన్ సత్య ప్రస్తుతం రితీష్ రానా దర్శకత్వంలో జెట్లీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన పోస్టరే చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒక జెట్ విమానం పైన సత్య నిల్చున్న విధానం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో సత్య కి హీరోయిన్ గా రియా సింగ్ కన్ఫర్మ్ చేశారు. నేడు రియా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక రియా విషయానికి వస్తే 2024 సెప్టెంబర్ 22న జైపూర్ జరిగిన తొలిదశలో, 51 ఫైనలిస్ట్‌లను ఓడించి ఆమె మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకుంది.

Advertisement

ఇక రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే వారణాసి సినిమా నుంచి మందాకిని పోస్టర్ ఎలా అయితే ఉందో అదే స్థాయిలో ఒక చేత్తో గన్ పట్టుకొని రియా ఉంది. అయితే మందాకిని నీటుగా చీర కట్టుకున్న జేమ్స్ బాండ్ లా ఉంటుంది. కానీ ఈ సినిమా రియా పోస్టర్ మాత్రం జేమ్స్ బాండ్ టైపులో ఉంది.

కండిషన్స్ ఇవే 

కమెడియన్ సత్యా పక్కన హీరోయిన్ గా రియాన్ పెట్టినా కూడా వాళ్ళిద్దరికీ మధ్య లవ్ ట్రాక్ ఉండదు అని డైరెక్టర్ ఈ పోస్టర్ అనౌన్స్మెంట్ వీడియోలోనే తేల్చి చెప్పేసాడు. వెంటనే దానికి కమెడియన్ సత్య రియాక్షన్ కూడా మంచి సెటైరికల్ గా ఉంది.

Also Read : The Girl Friend : ది గర్ల్ ఫ్రెండ్ సినిమా పై మళ్లీ ట్రోలింగ్, బూతులు మొదలుపెట్టిన రాహుల్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×