E-Paper
Advertisement

Jana Nayagan Trailer: ముట్టుకోకు.. ముక్కలు చేస్తాడు.. జననాయగన్ ట్రైలర్ రిలీజ్

Jana Nayagan Trailer: ముట్టుకోకు.. ముక్కలు చేస్తాడు.. జననాయగన్ ట్రైలర్ రిలీజ్
Advertisement

Jana Nayagan Trailer: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సీనియర్ నటుడు విజయ్ థళపతి(Vijay Thalapathy) సంక్రాంతి పండుగ సందర్భంగా జన నాయగన్(Jana Nayagan) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జనవరి 9వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇటీవల మలేషియాలో ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఈ సినిమా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అంచనాలు పెంచిన ట్రైలర్..

ఎప్పటిలాగే విజయ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అబ్బురు పరచాలని చెప్పాలి. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ప్రేక్షకులకు కావలసిన యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయని స్పష్టమవతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇందులో విజయ్ కూతురి పాత్రలో మమత బైజు నటించబోతున్నారు ఆమెను ఆర్మీకి పంపించాలన్న ఉద్దేశంలోనే తన తండ్రి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆర్మీ వెళ్లడానికి ఇష్టపడిన తన కూతురి వెనుక ఉన్న సమస్య చుట్టూ ఈ సినిమా కొనసాగుతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సునీల్ వంటి తదితరులు విభిన్న పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.  ఇక ఈ సినిమాలో విజయ్ జోడిగా పూజ హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మమిత బైజు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా విజయ్ కు ఆఖరి సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అనంతరం ఈయన పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల విజయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇలా విజయ ఆఖరి సినిమా కావడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

భగవంత్ కేసరి రీమేక్?

Advertisement

జనవరి 9వ తేదీ ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కగా హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే ఈ సినిమా బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాని పోలి ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకి రీమేక్ చిత్రం అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి .కానీ దర్శకుడు వినోద్ మాత్రం ఈ సినిమా విజయ్ సినిమా అని తెలిపారు.

Advertisement

ఇక ఈ విషయంపై అనిల్ రావిపూడి కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యేవరకు ఇది మన సినిమానా? లేక విజయ్ సినిమానా? అనే విషయంపై క్లారిటీ రాదని తెలిపారు. ఇక విజయ ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇదివరకే విజయ్ పూజ హెగ్డే కాంబినేషన్లో బీస్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మరోసారి వీరిద్దరూ జంటగా జన నాయగన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం గమనార్హం.

Also Read: Ashish vidyarthi Injured: ప్రమాదానికి గురైన నటుడు ఆశిష్ విద్యార్థి.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×