Jana Nayagan Release Date:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) చివరి సినిమాగా వస్తున్న చిత్రం జననాయగన్ (Jana Nayagan). తెలుగులో అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna )హీరోగా నటించిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇకపోతే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. సెన్సార్ కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. చిత్ర నిర్మాతలకు – సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ మధ్య జరిగిన చట్టపరమైన వివాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. చిత్ర నిర్మాతలకు.. సిబిఎఫ్సీ పై వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఇకపోతే ఈ కేసులో కెవిఎన్ ప్రొడక్షన్స్ తరఫున వాదిస్తున్న న్యాయవాది విజయన్ సుబ్రహ్మణ్యం చేసిన అభ్యర్థనను జస్టిస్ పిటి ఆశ అనుమతించారు. కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నట్లు నిర్మాణ సంస్థ హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ ద్వారా తెలియజేసింది. సినిమాను మరొకసారి రివైజింగ్ కమిటీకి పంపి సమీక్ష ప్రక్రియను కొనసాగించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలుపగా.. చట్టపరమైన చర్యలను కొనసాగించడం లేదని కూడా లేఖలో నిర్మాతలు పేర్కొన్నారు. ఇక ఇప్పుడు పిటిషన్ ఉపసంహరణ చేసుకోవడంతో ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది..
అయితే ముందుగా అనుకున్నట్టుగానే మార్చి 19న యష్ టాక్సిక్ చిత్రానికి పోటీగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ పోటీ నుండి చిత్ర బృందం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేయడానికి మేకర్స్ వెనక్కి తగ్గడానికి కారణం తమిళనాడులో జరగబోయే ఎన్నికలే ప్రధాన కారణం అని సమాచారం. ఇక ఈ సినిమా విడుదల కోసం ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీ అయితే.. ఈ సినిమా కోసం విజయ్ దళపతి కూడా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ అటు ఆయన తన రాజకీయ పార్టీ టీవీకేను ఈసారి ఎన్నికలలో బరిలోకి దించి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకే సమయంలో రెండు పడవల మీద ప్రయాణం కలిసి రాదు అనే నేపథ్యంలోనే చిత్ర నిర్మాతలు కూడా విజయ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా తమిళనాడులో ఎలక్షన్ డేట్ వెలువడిన తర్వాతనే తమ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికైనా ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:SitaPayanam Movie: అర్జున్ సీతాపయనం మూవీ హీరో బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
జననాయగన్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ దళపతి హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్ లుగా.. మమిత బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలో వస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో నేరుగా విడుదల కాబోతోంది. మరి ఇన్ని రూమర్స్, ఇన్ని వివాదాల తర్వాత విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.