Vijay Trisha: ఏ ముహూర్తాన దళపతి విజయ్ సీయం సీటు ఎక్కాడో కాని అప్పటి నుండి విజయ్, తన కో స్టార్ త్రిష ల గురించి ఇబ్బడి ముబ్బడిగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.వాళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తున్నా వాళ్లకి వాళ్ళుగా ఎక్కడా ఓపెన్ అవకపోవడంతో ఈ రూమర్స్ కాస్తా నిజమనుకునే పరిస్థితి, పైగా కలిసి కనిపించడం కూడా దీనికి బోనస్.
రావణాసురుడిగా విజయ్ ..అమ్మవారి రూపంలో త్రిష
ఇక వీరి సంగతి ఇలా ఉంటె తాజాగా వీరిద్దరి పేర్లు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి.కారణం సేలం దగ్గర లోని ఆత్తూర్ సమీపంలో ఏటా ఎంతో వేడుకగా నిర్వహించే ప్రసిద్ధ మారియమ్మన్ ఆలయ ఆషాఢ ఉత్సవాల్లో వీరి ఫ్లెక్సీలు పెట్టడమే. ఫ్లెక్సీలు పెట్టడం కామనేగా వాటికి వార్తల్లోకి ఎక్కడం ఎందుకనుకుంటున్నారా ..?ఆ ఫ్లెక్సీలలో విజయ్ ని పది తలలున్న రావణాసురుడిగా డిజైన్ చేయగా, త్రిషను పవిత్రమైన అమ్మవారి రూపంలో డిజైన్ చేయడమే ఇపుడు వివాదానికి కారణం అయింది.అసలే ఊరంతా భక్తి శ్రద్దలతో జరుపుకునే పండగ ఉత్సవాలల్లో ఇలా సినీ తారల ఫోటోలు ఇలా డిజైన్ చేసి పెట్టడం ఏంటని నోరెళ్ళబెట్టెస్తున్నారట అక్కడి జనాలు.
మతపరమైన భావాలను అవమానపరచడమే
ఇక ఈ బ్యానర్ ఫోటోలు ఇలా బయటకు వచ్చాయో లేదో, సోషల్ మీడియా షేక్ అయిపొయింది. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో, మతపరమైన ఉత్సవాల్లో ఇలా ఫ్లెక్సీలు పెట్టడం ఏంటని ఇది పూర్తిగా సాంప్రదాయాలను, మతపరమైన భావాలను అవమానపరచడమే అంటూ ఫ్లెక్సీలు అంటించిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.ఇక అలా ఏర్పాటు చేసిన వారిపై చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేయడం తో ఆ బ్యానర్ ఏర్పాటు చేసిన ఇద్దరు యువకులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు సేలం పోలీసులు.
అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో !
ఇక దళపతి విజయ్ విషయానికి వస్తే గత ఏడు నెలలుగా విడుదలకి నోచుకోలేక సెన్సార్ రూమ్ లో మగ్గిపోయిన జననాయగాన్ ఎట్టకేలకి ఈ నెల అంటే జులై 23న రిలీజ్ కానున్న సందర్భంగా ఇప్పటికే ఫెస్టివల్ మూడ్ లోకి వెళ్ళిపోయారు దళపతి ఫ్యాన్స్. మరో వైపు లేటెస్ట్ గా కరుప్పు వంటి సాలిడ్ హిట్ చూసిన ఈ చెన్నై చిన్నది చిరు పక్కన విశ్వంభరలో నటించిన సంగతి తెల్సిందే.
చూడాలి మరి దోబూచులాడుతున్న ఈ ఇద్దరు తమ ప్రేమాయణాన్ని అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో !
Salem, attur periya mariamman temple festival banner depicting actress Trisha as the Goddess and featuring CM vijay image potray Raavanan.
case has been registered against those who put up the banner.#TNCMVijay #TVKVijay #tirsha #raavanan pic.twitter.com/dsnZQ8lii2
— Mageshkumar Ramalingam (@mageshkumar27) July 21, 2026