Ishant Sharma On MS Dhoni: టీమిండియా ఒకప్పటి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ (MS Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టులో చాలా కూల్ గా ఉంటూ… టీమిండియా కు ఎన్నో విజయాలను అందించాడు. 2007 సమయంలో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని… తన పదేళ్ల పిరియడ్ లో మూడు ICC టైటిల్స్ అందించాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని సక్సెస్ స్టోరీ పై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. చాలామందిని జట్టులోకి రాకుండా తొక్కేశాడని ఆరోపణలు కూడా ఇప్పటికి చేస్తున్నవారు ఉన్నారు.
టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీపై తాజాగా టీమిండియా ఒకప్పటి స్టార్ బౌలర్ ఇశాంత్ శర్మ (Ishant Sharma) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మ్యాచ్ సందర్భంగా సరిగ్గా బౌలింగ్ చేయలేదని మహేంద్రసింగ్ ధోని తనను అవమానించాడని బాంబు పేల్చాడు. లైవ్ మ్యాచ్ జరుగుతుండగానే పచ్చి బూతులు తిట్టాడని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. కానీ మహేంద్రసింగ్ ధోని తిట్టడం వల్ల… తన నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చిందని కూడా కితాబ్ ఇచ్చారు.. దీంతో మహేంద్రసింగ్ ధోని పై ఇశాంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 2014లో లార్డ్స్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో ఒకప్పటి టీమిండియా స్టార్ బౌలర్ ఇశాంత్ శర్మ 74 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో లార్డ్స్ వేదికగా 28 సంవత్సరాల తర్వాత టీమిండియా చారిత్రాత్మక టెస్టు విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ 7 వికెట్లు పడగొట్టడానికి ముఖ్య కారణం మహేంద్రసింగ్ ధోని.
ఈ విషయాన్ని తాజాగా ఇషాంత్ శర్మ పంచుకున్నారు. లార్డ్స్ వేదికగా 2014లో జరిగిన టెస్ట్ గురించి ప్రస్తావిస్తూ… ధోని ఇచ్చిన సలహాలను పాటించాలని తెలిపారు ఇషాంత్ శర్మ. లార్డ్స్ మ్యాచ్ లో తాను సరిగ్గా బౌలింగ్ చేయలేదని వెల్లడించారు. అప్పటికే వన్డేలతో పాటు టి20ల నుంచి తనను బీసీసీఐ తొలగించినట్లు బాంబు పేల్చారు. టెస్టుల్లో కూడా అంతంత మాత్రమే ఆడుతున్నానని వివరించారు.
ఈ క్రమంలో తన వద్దకు వచ్చి మహేందర్ సింగ్ ధోని కీలక సూచనలు చేశాడని తెలిపారు. ఎప్పుడు కూల్ గా ఉండే ధోని చాలా సీరియస్ గా బౌన్సర్లు వేయాలని తెలిపినట్లు వివరించారు. లెగ్ సైడ్ లో ఫీల్డర్లను ఉంచి నిరంతరం షార్ట్ బంతులు వేయాలని తనకు ధోని మాస్టర్ ప్లాన్ వివరించాడని గుర్తు చేశారు. మొదట తాను అలా ఫాలో కాకుండా తనకు నచ్చిన వే-లో బౌలింగ్ చేయడంతో ధోని తిట్టినట్లు గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత బౌన్సర్లు వేసి ఇంగ్లాండును ఓడించినట్లు వివరించారు. దీనివల్లే తాను సక్సెస్ అయ్యానని ధోని కెప్టెన్సీని ప్రశంసించారు.