E-Paper
Advertisement

Sree Vishnu: సినిమా ముందే లీకైంది.. ‘విష్ణు విన్యాసం’ హడావుడి రిలీజ్‌కు కారణమిదే!

Sree Vishnu: సినిమా ముందే లీకైంది.. ‘విష్ణు విన్యాసం’ హడావుడి రిలీజ్‌కు కారణమిదే!
Advertisement

Sree Vishnu: శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో హీరో శ్రీ విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ విషయానికి సంబంధించి ఓ విషయాన్ని తర్వాత చెబుతానని అన్నారు. ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ ఉండగా, శ్రీ విష్ణు (Sree Vishnu) కలగజేసుకుని ‘విష్ణు విన్యాసం’ చిత్రం ఒక వారం ముందు విడుదలయ్యేలా చేశారని నిర్మాతలు చెప్పారు. అసలు అంత సడెన్‌గా ఈ మూవీని విడుదల చేయడానికి కారణం ఓటీటీనే కాకుండా మరో కారణం కూడా ఉందని ఆ ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు అన్నారు. తాజాగా ఆ కారణం గురించి చెబుతూ..

Also Read- Virosh Wedding Pics:: విజయ్, రష్మిక పెళ్లి ఫోటోలు షేర్ చేసిన ఈషా రెబ్బ.. తరుణ్ భాస్కర్ తో కలిసి హీరోయిన్ సందడి..!

రిలీజ్‌కు ముందే సినిమా లీకైంది

Advertisement

‘‘మ్యాటర్ ఏంటంటే.. మేము సడెన్‌గా, ఫాస్ట్ ఫాస్ట్‌గా సినిమాను రిలీజ్ చేయాలనే థాట్‌కి రావడానికి కారణం డిసెంబర్‌లో సినిమా అంతా ఎలానో లీకైపోయింది. అది ఎలా జరిగిందనేది తెలియదు. ఒక రోజు మార్నింగ్ లేచే సరికి నిర్మాత సుబ్రహణ్యం ఫోన్ చేసి.. సార్ మన సినిమా లీకైందని అన్నారు. ఆయన అలా లీకైంది అనగానే.. లీకవడం ఏంటి అని అసలు నాకేం అర్థం కాలేదు. సమ్ రాండమ్‌గా సినిమా లీకైంది.. ఎలా అయిందో తెలియదు. సైబర్ క్రైమ్‌కు కూడా కంప్లయింట్ చేశాం. అప్పటికే స్ప్రెడ్ అవడం వల్ల.. మా అందరిలో విపరీతమైన టెన్షన్ మొదలైంది. సినిమా ఇంకా పూర్తి కాలేదు.. సగమే పూర్తయింది. ఎలా.. ఏం చేయాలి? ఈ విషయం బయటకు చెబితే, వేరే విధంగా వెళుతుంది. అలా హ్యాకర్లు చేసే బ్లాక్‌మెయిల్‌కు మా నిర్మాత ధైర్యంగా నిలబడినందుకు థ్యాంక్స్. అలాగే చాలా తక్కువ టైమ్‌ ఉన్నా కూడా సినిమాను పూర్తి చేశాం. లాస్ట్ వారం రోజులే మాకు ప్రమోషన్స్ చేయడానికి కూడా టైమ్ కుదిరింది.

Also Read- Mahila Kabaddi: రియల్ కబడ్డీ ప్లేయర్స్‌తో ‘మహిళా కబడ్డీ’.. స్టోరీ లైన్ ఇదే!

చాలా గర్వపడుతున్నా..

Advertisement

ఇలాంటి టైమ్‌లో కూడా ధైర్యంగా ఉన్న నిర్మాతను చూసి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. చాలా డేంజర్ కూడా. కరెక్ట్‌గా 6 నెలల ముందు ఒక పెద్ద సినిమాకు కూడా ఇలా జరిగిందని.. వాళ్లు, మేము మాట్లాడుకున్నాక తెలిసింది. అది కూడా పెద్ద సినిమానే. ఇది మమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేసింది. ఇలాంటి టైమ్‌లో కూడా నిర్మాత చాలా ధైర్యంగా ఉన్నారు. వారికి నేను ఎంత సపోర్ట్ చేయాలో అంతా చేశాను. చాలా వరకు సినిమా బయటకు రాకుండా, దానిని అరికట్టి, సినిమాను రిలీజ్ చేశాం..’’ అని అసలు విషయాన్ని శ్రీ విష్ణు రివీల్ చేశారు. నిజంగా ఇదంతా ఎప్పుడు జరిగిందని, అంతా ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఆరు నెలల క్రితం లీకైన సినిమా ఏంటా? అని కూడా నెటిజన్లు సెర్చింగ్ మొదలెట్టారు.

Also Read- Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’లో మోహన్ బాబు విశ్వరూపం.. పాత్ర పేరు ఏంటంటే?

Related News

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

Big Stories

Advertisement
×