Srinivasa Mangapuram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైలాగ్ పవర్ హౌస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu). ఆయన నటనలో ఉండే గాంభీర్యం, డైలాగ్ డెలివరీలో ఉండే బేస్ మళ్ళీ చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కెరీర్ మొదట్లో మోహన్ బాబు విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆయన హీరోగా చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. భారీ పరాజయం, భారీ లాస్‌ను చవిచూశాయి. అందుకేనేమో.. తన రూటే సెపరేటూ అంటూ ఈ కలెక్షన్ కింగ్ ఇప్పుడు మళ్లీ తన తొలినాళ్లను గుర్తు తెచ్చేలా.. విలన్‌గా మారుతున్నారు. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise)లో పవర్ ఫుల్ విలన్ పాత్ర చేస్తున్న మోహన్ బాబు.. ఇప్పుడు ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) చిత్రంలోనూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా తాజాగా వచ్చిన అప్డేట్ చూస్తుంటే తెలుస్తోంది. అవును, ఈ సినిమా నుంచి శనివారం ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ (Venkatappayya Naidu)గా ఒక భీకరమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుపుతూ, మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే, అజయ్ భూపతి కలెక్షన్ కింగ్‌ను ఒక పక్కా లోకల్ అథారిటీగా చూపించబోతున్నాడని అర్థమవుతోంది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, దట్టమైన మీసం, కళ్ళల్లో కసి.. వెరసి మోహన్ బాబు ఒక పవర్‌ఫుల్ విలేజ్ పాట్రియార్క్‌లా కనిపిస్తున్నారు. తెల్లటి కుర్తా-ధోతీ కట్టులో, మెడలో బంగారు గొలుసులు, చేతికి బ్రాస్‌లెట్‌తో ఆయన నడిచి వస్తుంటే ‘రాయలసీమ’ పౌరుషం ఉట్టిపడుతోంది. ఆయన వెనుక తుపాకులు పట్టుకుని నడుస్తున్న అనుచరులను చూస్తుంటే, ‘వెంకటప్పయ్య నాయుడు’ మాట ఆ గడ్డ మీద శాసనం అని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read- Gandhi Talks OTT: విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’ స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే..
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కుమార్తె రషా థడాని నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన వీరి పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు మోహన్ బాబు వంటి సీనియర్ లెజెండ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర తోడవడంతో సినిమా వెయిట్ అమాంతం పెరిగిపోయింది. కేవలం నటీనటులే కాదు, టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా చాలా బలంగా రూపొందుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం ఇస్తున్నారు. సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఫైనల్‌గా అజయ్ భూపతి.. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో? ఘట్టమనేని వారసుడికి ఎలాంటి హిట్ ఇస్తాడో.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
A commanding presence. A story of conviction.#SrinivasaMangapuram brings VENKATAPPAYA NAIDU to the big screen with remarkable intensity.
Best wishes to the entire team. https://t.co/PM76l7bYis— Mohan Babu M (@themohanbabu) February 28, 2026
Also Read- Sangeetha Vijay: హీరో విజయ్ పై సంగీత పెట్టిన సెక్షన్లు ఇవే… చిక్కుల్లో నటుడు!