E-Paper
Advertisement

Vishwak Sen: ‘పెద్ది’ స్టోరీపై ఆన్ లైన్ లో అవాకులు.. గట్టి కౌంటర్ ఇచ్చిన విశ్వక్ సేన్

Vishwak Sen: ‘పెద్ది’ స్టోరీపై ఆన్ లైన్ లో అవాకులు.. గట్టి కౌంటర్ ఇచ్చిన విశ్వక్ సేన్
Advertisement

Vishwak Sen: రిలీజ్ కాకముందే రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీపై ఆన్ లైన్ లో కొందరు తప్పుగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రివ్యూవర్స్ ముసుగులో చెత్తంతా మాట్లాడుతున్నారు. ఆన్ లైన్ లో పెద్ది మూవీ స్టోరీపై పాడ్ కాస్ట్ లో ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు.

‘ఆ స్టోరీతో సినిమా చేస్తున్నారా? పైగా చికిరీలు అంటూ ప్రచారాలు చేస్తున్నారు. స్టోరీ చెబితే నాపై కేసు వేస్తారు’ అంటూ ఓ రివ్యూవర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు. ఈ వీడియోపై టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సినిమా మీద బతికే కొందరు ఆ సినీ పరిశ్రమను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అటువంటి వారిని పరాన్నజీవులు అని పిలువాలంటూ ఫైర్ అయ్యారు.

పరాన్నజీవులు

Advertisement

“ఇతని లాంటి వ్యక్తిని పరాన్నజీవి అని పిలవడం న్యాయమే. వీళ్లు సినీ పరిశ్రమ నుంచి ప్రయోజనం పొందుతున్నారు. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయినప్పటికీ సినిమా విడుదల కాకముందే దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇలా చేయడమంటే.. తిన్న ప్లేట్‌లోనే ఉమ్మివేయడం లాంటిది” అంటూ విశ్వక్ సేన్ ట్వీట్ చేశారు.

నెట్టింట చర్చ

విశ్వక్ సేన్ ట్వీట్ కు మద్దతుగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కొందరు సినిమాలపై బతుకుతూ ఆ సినిమాలపై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. సినిమాలపై తప్పుడు రివ్యూస్ ఇస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తులు మాటలు నమ్మే స్థితిలు ఆడియన్స్ లేరని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సినిమాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. క్రిటిక్స్ ముసుగులో వికృతంగా ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Related News

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

Big Stories

Advertisement
×