E-Paper
Advertisement

స్పిరిట్ సినిమాపై వివేక్ ఒబెరాయ్ భారీ హైప్.. పిక్చర్స్ అభీ బాకీ హై!

స్పిరిట్ సినిమాపై వివేక్ ఒబెరాయ్ భారీ హైప్.. పిక్చర్స్ అభీ బాకీ హై!
Advertisement

Vivek Oberoi:రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద తన మార్కెట్ ను పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభంలో మారుతీ దర్శకత్వంలో సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. ఆయన ఇమేజ్ కి ఎటువంటి ఎఫెక్ట్ పడలేదు అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు మరోవైపు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సినిమా గురించి చేసిన కామెంట్లు అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పిక్చర్ అభి బాకీ హై అంటూ చేసిన కామెంట్లు మరింత వైరల్ గా మారుతున్నాయి.

స్పిరిట్ పై అంచనాలు పెంచిన వివేక్..

తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న వివేక్ ఒబెరాయ్ తో ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తూ.. యానిమల్ సినిమాతో బాబీ డియోల్ , ధురంధర్ సినిమాతో అక్షయ్ ఖన్నా విలన్లుగా రీ ఎంట్రీలో అదిరిపోయే గట్టి కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు మీరు కూడా స్పిరిట్ సినిమాతో గట్టిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అని ప్రశ్నించారు. ఇక దీనికి వివేక్ ఒబెరాయ్ హిందీలో మాట్లాడుతూ.. “పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్ ” అంటూ సినిమా ఇంకా బాకీ ఉంది మిత్రమా అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈ పాత్ర కోసం చాలా డెడికేషన్ తో పని చేయాల్సిన అవసరం ఉంది. సందీప్ రెడ్డి వంగ మార్క్ మేకింగ్ లో నా పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతోంది అంటూ ఇన్ డైరెక్టుగా తన మాటలతో హింట్ ఇచ్చేశారు వివేక్. మొత్తానికైతే ఈ సినిమాతో గట్టి కం బ్యాక్ కాదు సాలిడ్ హిట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన తన మాటల ద్వారా చెప్పేశారు. మొత్తానికైతే మరొకసారి సందీప్ రెడ్డివంగా తన మార్కు చూపించబోతున్నారని తన మాటలతోనే చెప్పుకొచ్చారు వివేక్ ఒబెరాయ్.

Advertisement

also read:రామ్ చరణ్ పహిల్వాన్ లుక్.. తెర వెనుక కఠోర శ్రమ!

వివేక్ ఒబెరాయ్ సినిమాల విషయానికి వస్తే..

వివేక్ ఒబెరాయ్ అసలు పేరు వివేక్ ఆనంద్ ఒబెరాయ్. ఈయన ఎవరో కాదు ప్రముఖ నటుడు సురేష్ ఒబెరాయ్ కుమారుడు 2002లో హిందీ క్రైమ్ చిత్రం ‘కంపెనీ’ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. ఆ తర్వాత వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘సాథియా’ లో నటించి నూతన నటనతో అందర్నీ మెప్పించారు. ఇక మొదటి చిత్రమైన కంపెనీ సినిమాతో ఏకంగా రెండు ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు వివేక్. ఆ తర్వాత కామెడీ చిత్రం మస్తీ, హారర్ చిత్రం కాల్, యాక్షన్ చిత్రం షూట్ అవుట్ ఎట్ లోఖండ్వాలా సినిమాలతో కమర్షియల్ విజయాలను కూడా సొంతం చేసుకున్నారు.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×