E-Paper
Advertisement

V.V.Vinayak: పొలిటికల్ ఎంట్రీపై డైరెక్టర్ వినాయక్ కామెంట్.. ఒకవేళ వస్తే ఆ పార్టీలోనే!

V.V.Vinayak: పొలిటికల్ ఎంట్రీపై డైరెక్టర్ వినాయక్ కామెంట్.. ఒకవేళ వస్తే ఆ పార్టీలోనే!
Advertisement

V.V.Vinayak: సినిమా ఇండస్ట్రీకి.. రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే సినిమాలలో చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి అడుగుపెడుతుంటే.. అటు రాజకీయాల్లో సత్తా చాటిన వారు ఇటు సినిమాలలోకి కూడా వస్తున్నారు. ఇకపోతే దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వి.వి.వినాయక్ (VV Vinayak) కూడా తాజాగా రాజకీయ రంగ ప్రవేశం గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పొలిటికల్ ఎంట్రీపై డైరెక్టర్ కామెంట్..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వివి వినాయక్ మాట్లాడుతూ.. “నా తమ్ముడు వైసీపీలో పనిచేస్తున్నారు. మా నాన్నగారు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫాలోవర్ . మా అమ్మ నాన్నలు చనిపోయినప్పుడు జగన్ గారు మా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చారు. ఇలా మాది రాజకీయ వాసనలు ఉన్న కుటుంబమే.. దానిని నేను కూడా కాదనలేను. డెస్టినీ నన్ను ఎలా మారుస్తుందో తెలియదు. ముఖ్యంగా డెస్టినీ గురించి ఇప్పుడే మాట్లాడలేము కదా.. నేను రాజకీయాల్లోకి రానని చెప్పను..అలాగని ఇంట్రెస్ట్ లేదని చెప్పను.రాజకీయాలు తప్ప ఇంకేమీ లేదు. అది లేకుండా ఉండలేను అని కూడా చెప్పను. డెస్టినీ నన్ను ఏ వైపు అడుగులు వేయిస్తే అలా వెళ్ళిపోతాను.” అంటూ వివి వినాయక్ కామెంట్లు చేశారు. ఒకవేళ డెస్టినీ ఆయనను రాజకీయ రంగం వైపు అడుగులు వేయిస్తే ఆయన వైసీపీలోకి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వివి వినాయక్ కెరియర్..

Advertisement

1974 అక్టోబర్ 9న పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో జన్మించిన వినాయక్ తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 2002లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా వివి వినాయక్ కి మంచి విజయాన్ని అందించింది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నారు వివి వినాయక్. ఇక 2003లో చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు దుబాయ్లో జరిగిన 2006 ఐఫా అవార్డుల కార్యక్రమంలో ఠాగూర్ సినిమాను ప్రదర్శించారు. బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్ వంటి నటులకు విజయవంతమైన చిత్రాలను అందించారు. అంతేకాదు దిల్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజును పరిచయం చేశాడు.

also read:Achor Ravi: కెమెరా ముందు నాటకం మాత్రమే.. బిగ్ బాస్ తర్వాత ఆఫర్లపై రవి కామెంట్!

వివి వినాయక్ తదుపరి చిత్రాలు..

Advertisement

2018 తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన వి వి వినాయక్ 2023లో ఛత్రపతి హిందీ రీమేక్ చేసి అక్కడ డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. మళ్ళీ ఈ ఏడాది ఒక మంచి చిత్రంతో కం బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు వివి వినాయక్. ముఖ్యంగా ప్రముఖ స్టార్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో మళ్లీ తన మునుపటి రోజులను రిపీట్ చేస్తారేమో చూడాలి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×