E-Paper
Advertisement

Achor Ravi: కెమెరా ముందు నాటకం మాత్రమే.. బిగ్ బాస్ తర్వాత ఆఫర్లపై రవి కామెంట్!

Achor Ravi: కెమెరా ముందు నాటకం మాత్రమే.. బిగ్ బాస్ తర్వాత ఆఫర్లపై రవి కామెంట్!
Advertisement

Achor Ravi: ఒకవైపు సినిమాలలో నటిస్తూ.. మరొకవైపు టీవీషోల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ యాంకర్ రవి (Anchor Ravi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఇండస్ట్రీలో గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈయన కెమెరా ముందు ఎలా నటించాలో బాగా తెలుసుకున్న నేర్పరి. ఇకపోతే ఇలా తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న రవి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. ముఖ్యంగా డబ్బు కోసమే హౌస్ లోకి వెళ్ళానని, అయితే అక్కడ జరిగేది ఏదీ నిజం కాదు అని చెప్పి గుట్టు రట్టు చేశారు.

డబ్బు కోసమే బిగ్ బాస్ కి వెళ్ళాను..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి మాట్లాడుతూ.. “బిగ్ బాస్ తెలుగు ప్రారంభమైనప్పటి నుంచి హౌస్ లోకి రావాలని నాకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని పనుల కారణంగా నేను ఒప్పుకోలేదు. కానీ ఒక సమయంలో డబ్బు చాలా అవసరం కావడంతో షోకి వెళ్లడానికి అంగీకరించాను. కేవలం డబ్బు కోసమే వెళ్లాను. ఆ డబ్బుతో ఒక ఇల్లు కొనుగోలు చేసి ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.” అంటూ తెలిపారు. ఇకపోతే షోలో వచ్చే ప్రైజ్ మనీ కంటే ఇచ్చే పారితోషకం చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు రవి.

అక్కడ చూపించేదేది నిజం కాదు…

Advertisement

ఇకపోతే టీవీలో టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ..” టీవీలో టెలికాస్ట్ అయ్యేది రోజుకు కేవలం ఒక గంట మాత్రమే.. కానీ అది పూర్తిగా నిజం కాదు. ప్రేక్షకులు చూసేదానికి.. ఇంట్లో నిజంగా జరిగే దానికి చాలా తేడా ఉంటుంది. నేను పదేళ్లకు పైగా టీవీ పరిశ్రమలో కొనసాగుతున్నాను. అందుకే కెమెరాల ముందు ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. అవసరమైనప్పుడు నేను కూడా కెమెరా ముందు నాటకీయంగానే ప్రవర్తించేవాడిని కంటెంట్ కోసం ఏం చేయాలో తెలుసుకొని.. అందుకు అనుగుణంగా వ్యవహరించే వాడిని.. కెమెరాల మధ్య ఉన్నప్పుడు ఎవరైనా ఎంతటి వారైనా నటించాల్సిందే. పూర్తిగా నిజాయితీగా ఉన్నాము అని ఎవరైనా చెబితే నిజం కాదు” అంటూ రవి స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం రవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:Aditya dhar: డ్రీమ్ ప్రాజెక్టుకి సిద్ధమైన ధురంధర్ మూవీ డైరెక్టర్.. హీరో ఎవరంటే?

రవి కెరియర్..

Advertisement

రవి కెరియర్ విషయానికి వస్తే.. సెప్టెంబర్ 19న హైదరాబాద్లో జన్మించిన ఈయన వన్ షో, ఢీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, కిర్రాక్ , అలీ టాకీస్ వంటి కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా పనిచేశారు. మాటీవీలో నిర్వహించే సంథింగ్ స్పెషల్ కార్యక్రమం ద్వారా అభిమానులకు దగ్గరయ్యారు. ఇకపోతే టీవీ షోలలోనే కాదు సినిమాలలో కూడా నటించారు. 2012లో వచ్చిన ఈ రోజుల్లో అనే సినిమాలో అతిథి పాత్ర పోషించిన రవి.. 2017లో ఇది నా ప్రేమకథ అనే సినిమాలో హీరోగా నటించారు.

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×