E-Paper
Advertisement

Actress Harshavardan : నటుడు హర్షవర్ధన్ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం జాబ్ చేశాడు..? కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Actress Harshavardan : నటుడు హర్షవర్ధన్ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం జాబ్ చేశాడు..? కన్నీళ్లు తెప్పించే స్టోరీ..
Advertisement

Actress Harshavardan : సినీ ఇండస్ట్రీలో రాణించాలి అంటే అందం ఒకటే ఉంటే సరిపోదు అదృష్టం కూడా అంతో ఇంతో ఉండాలి. అందం అభినయం ఉన్న ఎంతో మంది యాక్టర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలు లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే.. ఈమధ్య చాలామంది ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు పలు ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న వాళ్లే. అందులో సినీ నటుడు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. ఆయన ఇండస్ట్రీ లోకి రాకముందు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, అవమానాలను దిగమింగుకున్నారన్న విషయాన్ని తాజాగా తన సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు.. ఆయన ఎమోషనల్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హర్షవర్ధన్ ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం జాబ్ చేశాడు అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

డెలివరీ బాయ్ టు నటుడు.. 

నటుడు హర్షవర్ధన్ సోషల్ మీడియా వేదికగా తన జీవితం మొదట ఎలా ఉంది అన్న విషయాన్ని పంచుకున్నారు. పొట్టకూటి కోసం డెలివరీ బాయ్‌గా పనిచేసిన రోజులను హర్షవర్ధన్ గుర్తుచేసుకున్నారు.. తను ఎంతో ఆరాధించే నటుడు జాన్ అబ్రహం ఫోటోలను చూస్తూ ఎప్పటికైనా ఆయనలా అవ్వాలని కలలు కనేవాడినని తెలిపారు. అప్పుడు ఆయనకు కేవలం అభిమాని మాత్రమే కానీ ఇప్పుడు ఆయన నిర్మాణంలో సినిమా చేస్తున్నారు. ఫోర్స్ 3 చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడం తన జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని భావోద్వేగానికి లోనయ్యారు. కలలు కనే డెలివరీ బాయ్స్ అందరికీ నేను ఒకటి చెబుతున్నాను.. మీ విధులు మీకు క్రమశిక్షణ అని అలాగే బాధ్యతలని నేర్పిస్తుంది. మీరందరూ కూడా జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి వెళ్తారు అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..

Advertisement

Also Read : షూటింగ్ లో ప్రమాదం.. స్వల్ప గాయలతో బయటపడ్డ రామ్ చరణ్..

హర్షవర్ధన్ సినిమాల విషయానికొస్తే.. 

సినీ నటుడు హర్షవర్ధన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగులో తకిట తకిట సినిమాతో కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అటుపై ప్రేమ ఇష్క్ కాదల్, అవును వంటి చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన ఆయన అక్కడ కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. రెండేళ్లగా హర్షవర్దన్ బాలీవుడ్ లో సినిమాలతోనే బిజీగా ఉన్నాడు. ఇక తెలుగు లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో కెరీర్ ని హిందీలో నే వరుసగా సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక తెలుగులో తర్వాత సినిమాలు ఎప్పుడు చేస్తాడో చూడాలి..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×